Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1. సినిమా హాలు

ఈ రోజు ప్రపంచ సినిమా ప్రియులకు అత్యంత ఇష్టమైన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే… ఈ రోజు ‘ప్రపంచ తొలి సినిమా హాలు’ ప్రారంభమైన రోజు అంటే ఓ రకంగా ‘ప్రపంచ సినిమా హాలు’  పుట్టిన రోజు.  1896లో జులై 26న ఇదే రోజు ఆ ‘ప్రపంచ సినిమా హాలు’ ప్రారంభమైంది. ఆ  రోజుల్లో సినిమా, ఆ టెక్నాలజీ  కొత్త. అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో సినిమా ప్రదర్శన ద్వారా సంపాదన సంపాదించటానికి కట్టిన తొలి హాలుగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. న్యూయార్క్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ విలియమ్‌ రాక్, తన భాగస్వామి వాల్టర్‌ వైన్‌రైట్‌తో కలిసి ఒక హాలు నిర్మించి దానికి ‘విటాస్కోప్‌ హాల్‌’ అని పేరు పెట్టారు. అప్పట్లో సినిమా రీళ్లలు తిప్పే ప్రొజెక్టర్‌ పేరే అది. అప్పటికి ఆ ప్రొజెక్టర్‌ను రూపొందించి మూడు నెలలే అయింది. ఆ ప్రొజెక్టర్‌ హక్కులను వాళ్లు 2,500 డాలర్లకు కొన్నారు. రాళ్లతో నిర్మించిన ఈ హాలులో 400 సీట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ హాలుగా ప్రదర్శించిన సినిమాల నిడివి కొన్ని నిమిషాలే. ‘నయాగరా ఫాల్స్‌’, ‘షూటింగ్‌ ద చూట్స్‌’ లాంటి సినిమాలను ప్రదర్శించారు. టికెట్‌ వెల  డాలర్‌లో పదో వంతు ఉండే నాణెం  అయిన ఒక ‘డైమ్‌’ . మరో డైమ్‌ ఇస్తే ప్రొజెక్టర్‌ గదిలోకి వెళ్లి చూడనిచ్చేవారు. అవి ‘సినిమా’  పుట్టిన ప్రారంభ రోజులు. సినిమాను కనిపెట్టిన లూమియర్‌ బ్రదర్స్‌ ఫ్రాన్స్‌లో తొలిసారిగా సినిమాను ప్రదర్శించిన ఏడు నెలలకే ఈ ‘విటాస్కోప్‌ హాలు’ను నిర్మించడం విశేషం. ఇప్పటి మన సినిమా హాళ్లకు తాత లేదా అమ్మమ్మ లాంటిదన్నమాట. సినిమా చూసేవాళ్లందరూ ఈ రోజుని గుర్తు పెట్టుకోవాలి. సినిమా హాలు పుట్టిన రోజుని జరుపుకోవాలి.

2  Stanley kubrick

 ‘మీ ఆల్‌టైమ్ ఫేవరెట్ హాలీవుడ్ మూవీ’ ఏదని అడిగితే సినిమావాళ్లలో చాలా మంది రెండో ఆలోచన లేకుండా ‘2001: ఎ స్పేస్ ఒడిస్సీ’ అని చెబుతారు.తమ జీవితంలో ఎన్నో  హాలీవుడ్ సినిమాలు చూసినా, వారి మస్తిష్కంలో ఆ సినిమా వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఆ చిత్రం గురించి ఆపకుండా అరగంట మాట్లాడగలరు. ప్రతి ఫ్రేమూ, ప్రతి టెక్నిక్కూ, ఆర్టిస్టులు, టెక్నీషియన్లూ… ఇలా ప్రతి విషయం గుర్తు ఉండిపోతుంది. ఈ సినిమా దర్శకుడు ఎవరూ అంటే స్టాన్లీ క్రూబ్రిక్. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. ఇక  ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే గొప్ప దర్శకుల జాబితా తయారు చేస్తే అందులో స్టాన్లీ కుబ్రిక్‌ పేరు తప్పకుండా ఉండాల్సిందే. ఆశ్చర్యపరిచే రియాలటీ, అద్భుతమైన సెట్టింగులు, మర్చిపోలేని సినీమాటోగ్రఫీలతో ఆయన సినిమాలు అలరించాయి. సినీ అభిమానులకు క్లాసిక్‌ సినిమాలుగా ఎప్పటికీ గుర్తుండిపోయే ‘స్పార్ట్‌కస్‌’, ‘ద కిల్లింగ్‌’, ‘పాథ్స్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘వన్‌ ఐడ్‌ జాక్స్‌’, ‘లొలితా’, ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌ లవ్‌’, ‘2001: ఎ స్పేస్‌ ఒడిస్సీ’, ‘బ్యారీ లిండన్‌’, ‘ద షైనింగ్‌’ లాంటి సినిమాలు ఆయన రూపొందించినవే.

 సినీ దర్శకుడు కాకముందు స్టాన్లీ కుబ్రిక్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్. ‘లుక్’ అనే పత్రికకు ఫొటోలిచ్చేవారు. ఆ తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో కొన్ని డాక్యుమెంటరీ మూవీస్ తీశారు. అలాగే, ఓ టీవీ షోకి సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా కూడా చేశారు. 1953లో ‘ఫియర్ అండ్ డిజైర్ ’ చిత్రంతో వెండితెర దర్శకునిగా మారారు. స్టాన్లీ సినిమాలన్నీ కాలాని కన్నా ముందుండే ఆలోచనలతో ఉంటాయి. పలు వివాదాస్పద అంశాలతో కూడా ఆయన సినిమాలు తీసి,  భేష్ అనిపించుకున్నారు. స్టాన్లీ తీసిన చివరి చిత్రం ‘ఐస్ వైడ్ షట్’ 1999 జూలైలో  విడుదలైంది. ఆ చిత్రం విడుదల కాకముందే మార్చిలో ఆయన కన్నుమూశారు.

3  Sandra Bullock
 ఈ రోజు ఆస్కార్ అవార్డ్ విజేత,హాలీవుడ్ స్టార్ హీరోయిన్ శాండ్రా బుల్లక్ పుట్టిన రోజు. కళ్ళు చెదిరే అందంతో మూడు దశాబ్దాలుగా వెండితెరని ఏలుతున్న నటి సాండ్రా బుల్లక్‌. నటిగానే కాదు నిర్మాతగా, ఫిలాంథ్రపిస్ట్‌గానూ గుర్తింపు పొందారు.తన తరం వాళ్లలో అత్యధిక రెమ్యునేషన్ అందుకుంటున్న నటిగా నిలిచింది సాండ్రా.  1987లో ‘హ్యాంగ్‌మెన్‌’ తో కెరీర్‌ ప్రారంభించి, ‘స్పీడ్‌’, ‘ఏ టైమ్‌ టు కిల్‌’, ‘ప్రపోజల్‌’, ‘ది హీట్‌’, ‘ఓసియన్‌ 8’, ‘క్రాష్‌’, ‘మిస్‌ కాంగ్‌నియాలిటీ’, ‘బర్డ్‌ బాక్స్‌’, ‘ది బ్లైండ్‌ సైడ్‌’, ‘ఆల్‌ ఎబౌట్‌ స్టీవ్‌’, ‘గ్రావిటీ’ వంటి చిత్రాలతో హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 2009లో ఆమె నటించిన బయోగ్రాఫికల్‌ డ్రామా ‘ది బ్లైండ్‌ సైడ్‌’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఆస్కార్‌ని అందుకున్నారు. అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు మైఖేల్‌ జెరోమ్‌ ఓహెర్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మైఖేల్‌కి తల్లిగా, అతన్ని ఫుట్‌బాల్‌లో ఛాంపియన్‌గా నిలపడంలో కీలక భూమిక పోషించిన తల్లి  పాత్రలో సాండ్రా బుల్లక్‌ అత్యద్భుతమైన నటనని ప్రదర్శించి ఆస్కార్‌ని కైవసం చేసుకుంది. ‘గ్రావిటీ’ కోసం ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యారు. అన్నింటినీ మించి ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానాన్ని గెల్చుకుంది.  ‘మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఉమన్‌’ గుర్తింపు పొందింది.  ఆమె నటించిన ‘స్పీడ్‌’ సినిమాను అభిమానులు మర్చిపోలేరు. స్పీడ్‌ తగ్గితే చాలు పేలిపోయేలా బాంబును అమర్చిన బస్‌ను నడుపుతూ సాహసవనిత పాత్రలో శాండ్రా ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటించిన ‘డిమోలిషన్‌ మ్యాన్‌’ (1993), ‘వైల్‌ యు వర్‌ స్లీపింగ్‌’ (1995), ‘ఎ టైమ్‌ టు కిల్‌’ (1996), ‘ప్రాక్టికల్‌ మ్యాజిక్‌’ (1998) ‘మిస్‌ కాంజెనిలియాలిటీ’ (2000), ‘క్రాష్‌’ (2004) ‘ఓషన్స్‌ 8’ (2018) లాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ప్రముఖ హాలీవుడ్ నటుడు నిర్మాత జాసన్ స్టాథమ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా చేసే ఆయన అంటే చాలా మంది యూత్ కు పిచ్చి. చాలా భాగం తనే స్టంట్స్ డిజైన్ చేసుకునే ఆయనకు ఫైట్స్ లేకపోతే సినిమా చేసినట్లు ఉండదంటారు. ఇంగ్లాండ్ లో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే కుంగుఫూ, కిక్ బాక్సింగ్, కరాటే ప్రాక్టీస్ చేస్తండేవారు. లోకల్ మార్కెట్ స్టాల్స్ లో పని చేస్తూ అక్కడ కుర్రాళ్లతో ఫైట్స్ చేస్తూండేవారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆయనకు అక్కడ మంచి పేరుంది. కామన్ వెల్త్ గేమ్స్ కు కూడా బ్రిటన్ తరుపున ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లాడంటే ఆయన సత్తా అంచనా వేయచ్చు.ఆయన్ని అక్కడ చూసిన ఓ యాడ్ ఏజన్సీ ప్రెంచ్ కనెక్షన్ కి మోడల్ గా అడిగింది. తర్వాత టామీ హిల్ ప్లిగర్, లెవీ వంటి అనేక బ్రాండ్స్ కు పనిచేసారు. ఆ తర్వాత గే రెచి దృష్టిలో పడి, ఆయన  డైరక్ట్ చేసిన Lock, Stock and Two Smoking Barrels, Snatch (2000) సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావటంతో ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ట్రాన్సపోర్టర్ ట్రయాలిజీ చిత్రం ఆయన్ను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.  The Italian Job, Crank , War, The Bank Job , The Mechanic , Spy   Fast & Furious 6 వంటి అనేక సినిమాలు ఆయన్ను హ్యాపినింగ్ స్టార్ ని చేసాయి.

4 ప్రముఖ హాలీవుడ్ నటుడు నిర్మాత జాసన్ స్టాథమ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా చేసే ఆయన అంటే చాలా మంది యూత్ కు పిచ్చి. చాలా భాగం తనే స్టంట్స్ డిజైన్ చేసుకునే ఆయనకు ఫైట్స్ లేకపోతే సినిమా చేసినట్లు ఉండదంటారు. ఇంగ్లాండ్ లో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే కుంగుఫూ, కిక్ బాక్సింగ్, కరాటే ప్రాక్టీస్ చేస్తండేవారు. లోకల్ మార్కెట్ స్టాల్స్ లో పని చేస్తూ అక్కడ కుర్రాళ్లతో ఫైట్స్ చేస్తూండేవారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆయనకు అక్కడ మంచి పేరుంది. కామన్ వెల్త్ గేమ్స్ కు కూడా బ్రిటన్ తరుపున ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లాడంటే ఆయన సత్తా అంచనా వేయచ్చు.ఆయన్ని అక్కడ చూసిన ఓ యాడ్ ఏజన్సీ ప్రెంచ్ కనెక్షన్ కి మోడల్ గా అడిగింది. తర్వాత టామీ హిల్ ప్లిగర్, లెవీ వంటి అనేక బ్రాండ్స్ కు పనిచేసారు. ఆ తర్వాత గే రెచి దృష్టిలో పడి, ఆయన  డైరక్ట్ చేసిన Lock, Stock and Two Smoking Barrels, Snatch (2000) సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమాలు కమర్షియల్ సక్సెస్ కావటంతో ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ట్రాన్సపోర్టర్ ట్రయాలిజీ చిత్రం ఆయన్ను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.  The Italian Job, Crank , War, The Bank Job , The Mechanic , Spy   Fast & Furious 6 వంటి అనేక సినిమాలు ఆయన్ను హ్యాపినింగ్ స్టార్ ని చేసాయి.

5 కేట్‌ బ్లాంచెట్‌

హాలీవుడ్‌ సినిమాని ప్రభావితం చేసిన హీరోయిన్స్ లో కేట్‌ బ్లాంచెట్‌ ఒకరు. ఆస్ట్రేలియన్‌ నటిగా, థియేటర్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న కేట్‌ పుట్టిన రోజు ఈ రోజు. ఆమె ఇప్పటివరకూ  రెండు ఆస్కార్‌ అవార్డులను, ఇతర అనేక పురస్కారాలను అందుకున్నారు. థియేటర్‌ నుంచి కెరీర్‌ని ప్రారంభించిన
 కేట్ కు 1997లో వెండితెరపై మెరిసే అవకాశం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రధానంగా రూపొందిన ‘పారడైజ్‌ రోడ్‌’లో ఆస్ట్రేలియన్‌ నర్స్‌గా సపోర్టింగ్‌ రోల్‌ పోషించారు. ఇది అంతగా ఆదరణ పొందలేదు. మరో సినిమా ‘థ్యాంక్స్‌ గాడ్‌ హి మెట్‌ లిజ్జీ’ సైతం మిశ్రమ ఫలితాన్నే చవిచూసింది. ‘ఆస్కార్‌ అండ్‌ ల్యూసిండా’ అనే చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఇందులో పాపులర్‌ నటుడు రాల్ఫ్‌ ఫీన్నెస్‌తో కలిసి నటించారు. ఇది ఆమె నటనకు మంచి పేరుని తీసుకొచ్చింది. విమర్శకులు ఆమె నటనపై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించారు. ఒక సక్సెస్‌ జీవితాల్నే మార్చేస్తుందన్నట్టు ఈ సినిమా ఆమెకి బ్రిటీష్‌ ఆఫర్‌ తెచ్చింది. ఇంగ్లాండ్‌కి చెందిన మొదటి ఎలిజబెత్‌ రాణి జీవితం ఆధారంగా బ్రిటీష్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న ఇండియాకు చెందిన ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ రూపొందించిన ‘ఎలిజబెత్‌’లో నటించే అవకాశం వరించింది. ఇందులో ఆమె ఎలిజబెత్‌ రాణిగా అద్భుత అభినయంతో ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ చిత్రంలో తన నటనకుగానూ ఆస్కార్‌కి ఎంపిక కాగా, బ్రిటీష్‌ అకాడమీ అవార్డుని సొంతం చేసుకున్నారు.దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు.

 ‘ఎలిజబెత్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘ది అవైటర్‌’, ‘బ్లూ జాస్మిన్‌’, ‘నోట్స్‌ ఆన్‌ ఏ స్కాండల్‌’, ‘ఎలిజబెత్‌: ది గోల్డెన్‌ ఏజ్‌’,
‘ఐ యామ్‌ నాట్‌ థేర్‌’, ‘కారోల్‌’, ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ ట్రిలోజి, ‘ది హ్యాబిట్‌’ ట్రిలోజి, ‘బాబెల్‌’, ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది క్రిస్టల్‌ స్కల్‌’, ‘సిండెరెల్లా’, ‘థోర్‌: రాగ్నారాక్‌’, ‘ఓసియన్‌ 8’ వంటి చిత్రాలతో అగ్ర నటిగా నిలిచారు. ‘ఎలిజబెత్‌’, ‘ది అవైటర్‌’, ‘నోట్స్‌ ఆన్‌ ఏ స్కాండల్‌’, ‘ఐ యామ్‌ నాట్‌ థేర్‌’, ‘ఎలిజబెత్‌: ది గోల్డెన్‌ ఏజ్‌’, ‘బ్లూ జాస్మిన్‌’, ‘కారోల్‌’ చిత్రాలకుగానూ ఏడుసార్లు ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యారు. 2005లో వచ్చిన ‘ది అవైటర్‌’, 2013లో వచ్చిన ‘బ్లూ జాస్మిన్‌’ చిత్రాలకు రెండుసార్లు ఆస్కార్‌ని అందుకున్నారు.

6 కెవిన్‌ స్పేసీ
కెవిన్‌ స్పేసీ చాలా చక్కని హాలీవుడ్‌ నటుడు. అందగాడు.నిర్మాత, సింగర్. ఈయన ఇదే రోజు జన్మించారు. స్టేజ్ యాక్టర్ గా ఎనభైల్లో కెరీర్ ప్రారంభించిన కెవిన్ ..తర్వాత టీవీల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు. మెల్లిగా సినిమాలవైపు ప్రయాణం పెట్టుకుని, తన నటనతో ఆస్కార్ ని సైతం మెప్పించి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డ్ సంపాదించాడు.The Usual Suspects (1995) , American Beauty (1999) సినిమాలు ఆయన్ను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాలి. అమెరికన్ బ్యూటీ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన స్విమ్మింగ్ విత్ షార్క్స్, సైక్లాజికల్ థ్రిల్లర్ సెవెన్, ఎల్ ఎ కాన్ఫిడెన్షియల్, పే ఇట్ ఫార్వర్డ్  వంటి సినిమాలు అయితే ఆయన్ని ఎవరెస్ట్ ఎక్కించాయి. అయితే లైంగిక వేధింపులు కేసులో ఆయన ఇరుక్కోవటంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది.  ఉన్నట్టుండి కనీసం ఓ డజనుమంది మగాళ్లతో ఈ నటుడి లీలలు బయటపడ్డాయి. 2016లో తన 18 ఏళ్ల కొడుకుతో ఈ స్పేసీ సెక్స్‌ నడిపారని ఓ బోస్టన్‌ టెలివిజన్‌ జర్నలిస్టు కథ బయటపెట్టింది. దాంతో ఒక్కసారిగా ఆయన కెరీర్ తిరగబడింది. పర్శనల్ కేసులు ప్రక్కన పెడితే ఆయన మంచి నటుడు అనేది మాత్రం కాదనలేని సత్యం.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com