Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 వెంకయ్య నాయుడు
ఈ రోజు వెంకయ్య నాయుడు గారు జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన కృషీవలుడు, సదా తెలుగువారి శ్రేయస్సును కోరుకునే స్నేహశీలి, తెలుగుబిడ్డ. నెల్లురులోని చనవటపాలెంలో పుట్టిన వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర యూనివర్శిటీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు, అతి తక్కువ కాలంలోనే ఉదయగిరి నియోజకవర్గం నుండి రెండుసార్లు నెగ్గారు. బీజేపి పగ్గాలు చేపట్టి సమర్దవంతంగా నిర్వహించారు. రాజ్యసభకు ఎన్నికై, తరువాత కాలంలో అనేక పదవులను చేపట్టారు. 13వ ఉపరాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు.

  1. అఖిలేష్ యాదవ్
    యంగ్ పొలిటీషన్ అఖిలేష్ యాదవ్ సైతం ఈ రోజే జన్మించారు. వీరి తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. ఇతను బిఈ, జె ఎస్ ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో చేసారు. యునివర్శిటి అఫ్ సిడ్నిలో ఎమ్. ఈ. చేసారు. ప్రస్తుతం 17 వ లోక్ సభలో మెంబర్ గా వున్నారు. 2012 నుండి 2017 వరకు సమజ్ వాద్ పార్టి నుండి విజయం సాధించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసారు.
  2. డైరక్టర్ విసు
    ప్రముఖ తమిళ సీనియర్‌ దర్శకుడు, నటుడు, రచయిత స్వర్గీయ విసు కూడా ఇదే రోజు జన్మించారు. కె.బాల చందర్‌ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఈయన…అదే బాలచందర్‌ దర్శకత్వంలో రజనీ నటించిన ‘తిల్లుముల్లు’ చిత్రంలో నటుడిగా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. విసు నాటకాలన్నీ కుటుంబ కథా చలన చిత్రాలుగా మారడం విశేషం. వాటిలో సంసారం ఒక చదరంగం సూపర్‌హిట్టయ్యింది. ‘ఆడదే ఆధారం’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు ‘శ్రీమతి ఒక బహుమతి’ చిత్రం పెద్ద హిట్. ఆయన పలు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. విసు తీసిన ‘నీంగ నల్ల ఇరుక్కనుమ్‌’ జాతీయ పురస్కారం అందుకుంది.

4 జి. సతీష్ రెడ్డి

ఇదే రోజున పుట్టిన మరో ప్రముఖుడు జి. సతీష్ రెడ్డి. నెల్లూరులోని మహిమలూరు అనే చిన్న పల్లేటూరిలో జన్మించిన ప్రస్తుతం భారత రక్షణ సమితికి ముఖ్య సలహాదారుగా వున్నారు. ఈయన డీ.ఆర్.డి.ఓ. కార్యదర్శిగాను, రక్షణ పరిశోధన, అభివృద్ది విబాగాంలోను పనిచేసారు. 2015లో రాయల్ ఎరోనాటికల్ సోసైటి నుండి రజిత పతకాం అందుకున్న తోలి భారతీయుడిగా ప్రసిద్దికెక్కారు. jntu ముండి బి.టెక్, అండ్ ph.d చేసారు. అంతరక్ష పరిజ్ఞానంలో, క్షిపణులపై విస్తుత పరిశోదనలు చేసారు.

5 ఎ. కోదండ రామి రెడ్డి
ప్రముఖ సీనియర్ తెలుగు దర్శకుడు ఎ. కోదండ రామి రెడ్డి కూడా ఇదే రోజు జన్మించారు. కోదండరామిరెడ్డి పేరు వినగానే మనకు చిరంజీవి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన్ని సుప్రీమ్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది కోదండరామిరెడ్డే. ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి క్రేజ్‌ను అమాంతం పెంచేశారు కోందరామిరెడ్డి. అంతేకాదు, చిరంజీవితోనే ఆయన అత్యధిక సినిమాలు తీశారు. భారత సినీ చరిత్రలో వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక దర్శకుడిగా కోదండరామిరెడ్డి నిలిచిపోయారు. శ్రీధర్, చంద్రమోహన్ నటించిన ‘సంధ్య’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘కిరాయి రౌడీ’తో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ కుదిరింది. ఆ తర్వాత వీరి కాంబోలో ‘న్యాయం కావాలి’, ‘అభిలాష’ చిత్రాలు వచ్చాయి. అయితే, ‘ఖైదీ’ సినిమాతో కమర్షియల్ ప్లాట్‌ఫాం ఎక్కిన కోదండరామిరెడ్డి ఇక అక్కడి నుంచి తిరుగులేని మాస్ సినిమాలు తీశారు. ‘ఖైదీ’ తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల వల్ల చిరంజీవి తిరుగులేని మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు.

  1. పండిత్ హరిప్రసాద్ చౌరాసియా
    ఇదే రోజున ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరాసియా కూడా జన్మించారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఆయన హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి. హరిప్రసాద్ వారణాసికి చెందిన పండిట్ భోలానాథ్ పర్యవేక్షణలో వేణువు వాయించడం నేర్చుకొన్నాడు. తన ప్రతిభానైపుణ్యంతో వేణుగానంలో శాస్త్రీయపద్ధతులనూ, ఆధునిక పోకడలనూ అవలంబించాడు. సంతూర్ వాద్యసంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మతో కలిసి ఆయన ఎన్నో కచేరీలు చేశాడు. వారి జుగల్‌బందీ శివ-హరి గా ప్రసిద్ధినొందినది. బాలమిత్రుల కథ సినిమాలో పాపులర్ సాంగ్ గున్నమామిడి కొమ్మ మీద కు వేణుగాన సహకారం అందించింది కూడా ఆయనే. పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ అవార్డ్ లతో ప్రభుత్వం సత్కరించింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

 ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి 

Banner
, , ,
Similar Posts

వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంపై ప్రధానమంత్రి దార్శనికతని నొక్కిచెప్పిన శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్; వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గనులు పరిశ్రమల మంత్రుల రెండు రోజుల సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఉక్కు శాఖా మంత్రి

Latest Posts from Vartalu.com