Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 భారతీ రాజా
తమిళ సినిమా దర్శకుడు అయిన కూడా తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించిన భారతీరాజా పుట్టినరోజు ఈ రోజు. కమల్ తో చేసిన ఎర్ర గులాబీలు సినిమాతో ఆ నాటి యువకులను ఉర్రుతలుగించాడు.ఆయన దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక సినిమాతో ప్రేమలోని మధురాన్ని తెలుగు వారికి పంచారు రాజా . సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. అలాగే భారతి రాజా మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించాడు. దర్శకుడిగా పలు జాతీయ అవార్డులు పొందిన భారతీరాజా.. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్ లాంటి చాలామందిని తమిళ తెరకు పరిచయం చేశారు. 16 ఏళ్ల వయసు, టిక్.. టిక్.. టిక్, అలైగల్ ఒయివతిల్లై లాంటి అనేక హిట్ చిత్రాలు ఆయన చేతుల మీదుగానే వచ్చాయి. గ్రామీణ నేపథ్యంలో సినిమా తియ్యాలంటే భారతీరాజా ఒక్కడే… ఆ పల్లెటూళ్లనించొచ్చిన ఈ భారతీరాజాకి అవి తప్ప ఈ సిటీ ఈ మోడ్రన్ కల్చరూ మోడ్రన్ సినిమా ఏమాత్రం తెలీదు అని అప్పట్లో చెప్పుకునేవారు. సహజత్వానికి అతి దగ్గరగా చిత్రాలు తెరకెక్కించే భారతీరాజా.. విలక్షణ దర్శకుడిగా పేరుగాంచాడు. 2004 లో పద్మశ్రీ వచ్చింది వీరికి.

2 రంగనాథ్

ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ జయంతి ఈ రోజు. ఆయన ఇదే రోజు జన్మించారు. సుమారు 300కు పైగా చిత్రాల్లోనటించిన ఆయన, పలు చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. 50కు పైగా చిత్రాల్లో విలన్ పాత్ర పోషించారు. మొగుడ్స్-పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పలు సీరియళ్ళలో కూడా ఆయన నటించి అభిమానులను మెప్పించారు. దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో 1949లో జన్మించిన రంగనాథ్. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. ఎక్కువగా సోషల్, మైథలాజికల్ చిత్రాలలో నటించి మెప్పించిన రంగనాధ్ 1974 లో చందన అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. పంతుల‌మ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు.ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌టం ఆయ‌నను మ‌హిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గర చేసింది. కానీ సినీ రంగంలో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కెరీర్ ప్రారంభం లోనే ఒడిదుడుకులు వ‌చ్చాయి. దీంతో మ‌రో మార్గం లేక విల‌న్ గా మారారు. ‘గువ్వల జంట’ సినిమాతో తొలి సారిగా విలన్ పాత్ర‌లో అల‌రించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు రంగ‌నాధ్. పౌరాణిక నేప‌థ్యంతో తెర‌కెక్కిన భాగవ‌తం సీరియ‌ల్ తో పాటు, రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ లోనూ కీలక పాత్ర‌లో న‌టించారు. ఈయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాధ్.తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బి.ఏ పూర్తిచేసిన ఈయన ఇండియన్ రైల్వేస్ లో టిక్కెట్ కలెక్టర్ గా కూడా పని చేసారు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. వీరు రచించిన కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి

3 డేవిడ్ హసెల్‌హోఫ్ David Hasselhoff

ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘బేవాచ్’ టీవీ సీరియల్ నటుడు డేవిడ్ హసెల్‌హోఫ్ ది ఈ రోజే పుట్టిన రోజు. బేవాచ్ లో లాస్‌ఏంజెలిస్ కౌంటీ లైఫ్‌గార్డ్ మిచ్ బుచన్నన్ పాత్రలో అందరికీ మెప్పించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ఆ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన ఇతడు నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణించాడు. టీవీలో అత్యధికులు చూసిన నటుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. అనేక టీవీ సీరియల్స్‌తో పాటు వెండితెరపై ‘క్లిక్’, ‘డాడ్జ్‌బాల్’, ‘ద స్పాంజ్‌బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ మూవీ’, ‘హాప్’లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల్టిమోర్‌లో 1952 జులై 17న పుట్టిన ఇతడు ఏడేళ్ల నుంచే నాటకాల్లో వేషాలు ధరించడం విశేషం.ఆ తర్వాత మెల్లిగా టీవీల్లోకి, అనంతరం సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు.

4 రవి కిషన్

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన రవి కిషన్ పుట్టిన రోజు ఈ రోజు. ఆ తర్వాత కిక్ 2, సుప్రీమ్, ఒక్క అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్మల్యే, ఎన్టీఆర్ కథా నాయకుడు, సైరా నరసింహా రెడ్డి, సాక్ష్యం వరసపెట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు భోజపురిలో సూపర్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ సినిమాలు సైతం చాలా చేసారు. రాజకీయాల్లోకి వచ్చి గోరఖ్‌పూర్ బిజెపి ఎంపి గా ఎంపికయ్యారు. మన దేశంలో హిందువుల జనాభా 100 కోట్లని… అందువల్ల ఈ దేశం ముమ్మాటికీ హిందూ దేశమేనని అన్నారు. ప్రపంచంలో ఎన్నో క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయని… మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను సజీవంగా ఉంచుకునేందుకు మనకు ‘భారత్’ ఉండటం అద్భుతమని అనటం వివాదాలు సృష్టించింది. అయినా ఆయన వెనకడుగు వెయ్యలేదు.

రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా పేరుతో విలన్ గా నటించి మెప్పించిన ఆయన నటనలోనే కాదు ఎంపీగా కూడా పార్లమెంట్ సమావేశాల్లో తన ప్రసంగంతో లోక్ సభలో ఆకట్టుకున్నారు. లోక్ సభలో భోజ్ పురి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రవి కిషన్తమ భాషకు సముచిత స్థానం కావాలని ఆయన పార్లమెంట్ వేదికగా తన వాణి వినిపించారు. అంతే కాదు పాత పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడుతారనీ, అర్థం చేసుకోగలరని రవి కిషన్ తెలిపారు. కరేబియన్ దేశాలలో కూడా భోజ్ పురి మాట్లాడుతున్నారని, అయినా ఇప్పటివరకూ తమ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆయన తన ఆవేదన తెలియచేసారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడతారనీ, అర్థం చేసుకోగలరని రవి కిషన్ పేర్కొన్నారు. మారిషస్ లో మరో అధికార భాషగా భోజ్ పురిని గౌరవించారని ఆయన పేర్కొన్నారు. అలా ఓ ప్రక్కన నటుడుగా మరో ప్రక్కన తన భాషా సంస్కృతికోసం ఆయన పాటుపడుతున్నారు.

5 Samyuktha Hegde
నిఖిల్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెడ్గే పుట్టిన రోజు ఈ రోజు. మొదట కన్నడంలో ఇదే టైటిల్ తో వచ్చిన సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె పోషించిన ఆర్య పాత్రకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఆమె ఆ తర్వాత MTV Roadies, బిగ్ బాస్ కన్నడ, MTV Splitsvilla వంటి రియాల్టి షోలలో నటించింది. సినిమా నటన మీద ప్రేమతో చదువు మధ్యలో ఆపేసిన ఆమెకు ఫేస్ బుక్ ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అయ్యి కన్నడ కిరాక్ పార్టీలో వేషం ఇచ్చారు. ఆడిషన్స్ కు పిలిచినప్పుడు ఇంత సక్సెస్ అయ్యే సినిమాలో తాను నటిస్తానని ఊహించలేదంటుందామె. కమర్షియల్ గా పెద్ద హిట్ అవటంతో లో కన్నడంలో ఆమె పేరు మారు మ్రోగిపోయింది. ఆమె లేకపోతే కిరాక్ పార్టీ అనే సినిమా లేదని రివ్యూలు వచ్చాయి. అవన్నీ ఆమెను అతి తక్కువ టైమ్ లోనే స్టార్ ని చేసాయి. కన్నడంలో ఆఫర్స్ బాగానే వస్తున్నా, తమిళ, తెలుగు సినిమాల్లో బిజీ కావాలని చూస్తూ ఆ దిసగా ప్రయత్నాలు చేస్తోంది.

6.నిర్మల్ జిత్ సింగ్

పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేస్తారు. ఈ పేరుకు అర్థం “అత్యున్నత ధైర్య చక్రం”. ఈ పురస్కారాన్ని అందుకున్న నిర్మల్ జిత్ సింగ్ పుట్టిన రోజు ఈ రోజు. ఇక్కడో ప్రత్యేకత ఉంది. ఫ్లైయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ మాత్రమే ఇప్పటి దాక వాయు సేనలో ఈ పతకం పొందారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలకు దీన్ని ప్రదానం చేసారు.పురస్కార గ్రహీతలకు పురస్కారంతో పాటు నగదు భత్యం కూడా లభిస్తుంది. ఈ పురస్కారం ద్వారా లభించే మొత్తాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించారు. ఇదే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు కూడా భత్యాలు ఇస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గ్రహీత, గ్రహీతతో పాటు ఉండే ఒక్కరికి జీవిత కాలం ఉచితంగా మొదటి తరగతి రైలు ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించింది. రవాణా మంత్రిత్వ శాఖ, గ్రహీతలకు టోల్ పన్నును తొలగించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్, గ్రహీతలకు టిక్కెట్లపై 75% రాయితీని అందిస్తుంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com