Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.katrina kaif

ఈ రోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జన్మదినం. కత్రినా కైఫ్ కెరీర్ తొలినాళ్లలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత.. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. నమస్తే లండన్, పార్టనర్, వెల్‌కమ్, రేస్, న్యూయార్క్, జిందగీ నా మిలేగీ దొబారా, ఏక్ థా టైగర్ లాంటి చిత్రాలు ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని కట్టబెట్టాయి. హిందీ, తెలుగు, మళయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించింది. జాతీయ, అంతర్జాతీయ, ఫిలింఫేర్ అవార్డులను సాధించిందీ బ్రిటిష్ యువతి. పూర్తి పేరు కత్రీనాకైఫ్ తుర్కోటి. 14 ఏళ్ల ప్రాయంలోనే హవాయిలో అందాల పోటీల్లో పాల్గొంది. గేమ్ షోలతో పాటు సల్మాన్‌ఖాన్ నిర్వహించిన ‘బీయింగ్ హ్యూమన్’ కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరించింది. వరల్డ్ సెక్సీయస్ట్ ఉమన్ గా గుర్తింపు తెచ్చుకొంది. హిందీలో ‘బూమ్’ ఆమె తొలి బాలీవుడ్ చిత్రం. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించింది. ఆ తరువాత ‘సర్కార్’, ‘ధూమ్ 3’ చిత్రాల్లో నటించింది. మళయాళంలో ‘బలరామ్ వర్సెస్ తారాదాస్’లో ‘సుప్రియ’ పాత్రలో కనిపించింది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘జీరో’లాంటి చిత్రాల్లో సందడి చేసింది. ‘ హిందీలో విడుదలైన ‘న్యూయార్క్’ చిత్రంలో నటనకు గాను ‘ఫిలింఫేర్ అవార్డుకు నామినేటైంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ‘స్టైల్ దివా ఆఫ్ ద ఇయర్’ అవార్డు సహా మొత్తం 35 అవార్డులు ఆమె సొంతం. అత్యధిక రెమ్యునేషన్ ఆందుకున్న నటిగా గుర్తింపు పొందింది.

2 అరుణా అసఫ్ అలీ(1909-1996)

ఈ రోజు సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో తనకే సొంతమైన ధీరత్వంతో చరిత్రకెక్కిన మహిళ అరుణా అసఫ్ అలీ పుట్టిన రోజు.
భారత మాత ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమ వంతు కృషి చేసిన మహిళా మూర్తి. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిందీమె. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. అలాగే భారత రత్న అవార్డు గ్రహీత.

  1. Ginger Rogers
    హాలీవుడ్ స్వర్ణయుగానికి చెందిన మేటి తార జింజర్ రోజెర్స్ ఈ రోజు జన్మించింది. నటిగా, గాయనిగా, డ్యాన్సర్‌గా కొన్ని దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతూ, ప్రేక్షకులను ఉర్రూతలూగించడమంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆమె అంత కీర్తి. అలనాటి ప్రేక్షకుల వెండితెర వేలుపుగా వెలిగు వెలిగిన ఆమె… సంగీతాభిమానుల ఆరాధ్య దేవత. ఆనాటి యూత్ ని డ్యాన్స్‌లతో ఊపేసిన చలాకీ రాణి. బహిరంగ వేదిక, రేడియో, టీవీ, సినిమా… రంగం ఏదైనా రాణించి 20వ శతాబ్దంలోనే అత్యంత ప్రాచర్యం పొందిందీ అందాల భామ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ..తొమ్మిదేళ్లకే ఓ డ్యాన్స్ పోటీలో గెలిచి ఆపై సొంతంగా ప్రదర్శనలు ఇచ్చేంత పేరు సంపాదించింది. సంగీత రూపకాలు, నాట్య ప్రదర్శనలు, పాటలతో తీరిక లేకుండా ఊర్లు చుట్టబెట్టేసింది. దాంతో హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్ద ప్యారమౌంట్ పిక్చర్స్ వాళ్లు భారీ రెమ్యునేషన్ తో ఎంగ్రిమెంట్ కాగితాలుల రెడీ చేయించి, సంతకాలు పెట్టించేసుకున్నారు. అలా ‘ఫార్టీ సెకండ్ స్ట్రీట్’, ‘స్వింగ్ టైమ్’, ‘టాప్ హ్యాట్’, ‘కిట్టీ ఫోలే’, ‘హెలో డాలీ’ లాంటి సినిమాలతో అలరించింది. ఉత్తమ నటిగా ఆస్కార్ కూడా అందుకుంది. హాలీవుడ్‌లోనే అత్యధిక రెమ్యునేషన్ అందుకున్న నటిగా ఎదిగింది. అమెరికా ఫిలిం ఇనిస్టిట్యూట్ రూపొందించిన ‘వందేళ్లు.. వందమంది మేటి తారలు’ జాబితాలో 14వ స్థానం పొందింది. ఈమె తన జీవిత కథ ‘జింజర్: మై స్టోరీ’గా వెలువడింది. తన కెరీర్ లో అనేక పురస్కారాలు పొందిన Hollywood Walk of Fame అవార్డ్ ని సైతం పొందింది.

4 T.R. Sundaram
మోడరన్ థియేటర్స్ (Modern Theatres) దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ. ఇది సేలంలో ఉండేది. ఈ సంస్థను స్దాపించిన టి.ఆర్.సుందరం పుట్టిన రోజు ఈ రోజు. ఈ సంస్ద ద్వారా 1982 వరకు 150 పైగా చిత్రాలను, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, సింహళం, ఆంగ్ల భాషలలో ఆయన నిర్మించారు. మోడ్రన్ థియేటర్స్ స్టూడియోస్ అధినేత టీఆర్ సుందరం యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండేవారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ప్రతిభను అందరికంటే ముందుగా గుర్తించింది ఆయనే అని చెబుతారు. కరుణానిధి ఎప్పుడు సేలం వెళ్లినా మోడ్రన్ థియేటర్‌ని తప్పక తిలకించేవారు. ప్రస్తుతం అది పెద్ద బంగ్లాగా మారిపోయింది. అయితేనేం సుందరం పేరు చిరస్దాయిగా సినీ చరిత్రలో నిలిచిపోయింది.

5 కార్టూనిస్ట్ శేఖర్

తన వ్యంగ్య చిత్రాలతో రాజకీయాలకు భాష్యం చెప్పిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ఈ రోజునే జన్మించారు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అభిరుచిగా పెట్టుకొన్న ఆయనను చుట్టూ ఉన్న ఉద్యమ వాతావరణం ఉత్సాహపరిచింది. ఎంఏ (తెలుగు) పూర్తయిన తరువాత పూర్తిగా చిత్రకళారంగానికే శేఖర్ అంకితం అయ్యారు. పత్రికలను వేదిక చేసుకొని తన భావాలకు రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్ట్‌గా 1989లో తన ప్రస్థానం మొదలుపెట్టారు.కొంతకాలం ఇతర పత్రికల్లో పనిచేసి.. 19 97లో రాజకీయ కార్టూనిస్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేశారు. తుదిశ్వాస విడిచేవరకు సంస్థకు సేవలు అందించారు. 20 ఏళ్లలో దాదాపు 45 వేల కార్టూన్‌లు ప్రచురించారు. ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి అనుబంధ నవ్య వార పత్రికలో శేఖర్ ట్యూన్స్, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లైఫ్ లైన్ శీర్షికలను నిర్వహించారు. మృతి చెందడానికి కొద్దిరోజుల ముందే ‘కాస్ట్ కేన్సర్’ పుస్తకాన్ని తీసు కొచ్చారు. గిదీ తెలంగాణ, బ్యాంక్ బాబు, శేఖర్ టూన్స్, పారాహుషార్ తదితర కార్టూన్ పుస్తకాలు వెలువరించారు. బెల్జియమ్‌లో 1996లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు అందుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని.. విజేతగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారంతో సత్కరించింది. అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొ న్నారు. రాజకీయ కార్టూన్లు వేయడంలో ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. శేఖర్ కార్టూన్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది.

6 ధన్‌రాజ్ పిళ్లై

ఈ రోజు మరో ప్రముఖుడు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై పుట్టిన రోజు. ఆధునిక భారతీయ హాకీ జట్టులో అతిపెద్ద స్టార్‌గా నిలిచిన పిళ్లై తన 15 ఏళ్ల క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలిపిక్స్‌తో పాటు ప్రపంచ టోర్నీలు, చాంపియన్ ట్రోఫీలు, ఏషియన్
గేమ్స్‌లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్‌ల్లో 170 గోల్స్ సాధించి, అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ జట్టు హాకీ టీమ్‌కు విదేశీ కోచ్‌ను నియమించడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే పిళ్ళై స్వదేశంలో మంచి కోచ్‌లు ఇంకా బతికే ఉన్నారన్నారని చెప్తూంటారు. భారత హాకీ జట్టుకు విదేశీ కోచ్ అవసరం లేదని , వారి కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు చేసారు. దేశంలో అత్యుత్తమ కోచింగ్ ఇచ్చే వ్యక్తులు ఇంకా చనిపోలేదని , తనలాంటివాళ్లకు ఒక్క అవకాశమిస్తే ఏడాది తిరిగే లోపు మంచి ఫలితాలు రాబడతానని చెప్తూంటారు. కేవలం భారత కోచ్ మాత్రమే మన ఆటగాళ్ళను అర్థం చేసుకుంటాడని పిళ్ళై తెలిపాడు. జట్టులో 60 శాతానికి పైగా ఆటగాళ్ళు విదేశీ కోచ్ భాష అర్థం చేసుకోలేరని , ఫలితాలపై దీని ప్రభావమే ఎక్కువ ఉంటుందని ఆయన వాదిస్తూంటారు. ఈయన 1999-2000 సంవత్సరానికి, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. 2000 సంవత్సరములో అతను పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నాడు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com