Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 హాలీవుడ్ స్టార్ హారిసన్ ఫోర్డ్

 ఓవరాల్ వరల్డ్ లో కలెక్షన్ కింగ్ ఎవరూ అంటే  హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ పేరు చెప్తారు. ఆయన ఈ రోజే జన్మించారు.  కెరీర్లో ఇప్పటి వరకు 41 సినిమాలు చేసారు. హాలీవుడ్ చిత్రాలు ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి చిత్రాల్లో ఆయన కీలకమైన పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాలు ఓవరాల్ గా ఇప్పటి వరకు 4.7 బిలియన్ డాలర్ల (3 లక్షల కోట్లకు పైగా) వసూళ్లు సొంతం చేసుకున్నాయి. చాలా కాలం పాటు ఆయనే నెం.1 గా వెలిగాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.  ఇండియానా జోన్స్ సినిమా సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో ఒక మిసైల్ లా దూసుకువచ్చిన అలనాటి హీరో హారిసన్ ఫోర్డ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.  అమెరికా నటుడైన హారిసన్ ఫోర్డ్ స్టార్ వార్స్ సిరీస్ ద్వారా హాలివుడ్‌లోకి ప్రవేశించారు. అపోకలిప్సీ నౌ, ది ఫుజిటివ్, బ్లేడ్ రన్నర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. విట్‌నెస్‌లో హీరోగా నటించిన ఫోర్డ్‌కు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును అందుకున్నారు.హారిసన్ ఫోర్డ్ వెండితెర మీదే కాదు.. నిజజీవితంలో కూడా హీరోగానే ఉన్నారు. ఓ సారి  ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానంలో ఇంజన్ పనిచేయక అత్యవసరంగా దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా చాకచక్యంగా దాన్ని గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించి పరోక్షంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారు. స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ మంచి నైపుణ్యం గల పైలట్. 1966లోనే పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ ఇంతకుముందు కూడా నిజ జీవితంలో పలు సాహసాలు చేశారు. 2000 సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగు ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి అక్కడికి తన విమానంలో వెళ్లి ఆమెను రక్షించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు.  

2  Pranav Mohanlal
ఎక్కడో ఈ పేరు విన్నట్లు ఉంది కదా.. అవును..మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు. ఈ కుర్రాడి పుట్టిన రోజు ఈ రోజు. ఈ కుర్రాడు కూడా సినిమా హీరోనే.  నటనలో ప్రణవ్ తండ్రికి తగ్గ తనయుడే. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. అందులో పునర్జని అనే సినిమాలో నటనకు గాను 2002లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా అందుకున్నాడు.చిన్నతనం నుండే సినిమాలంటే ఆసక్తి.  సరైన వయసు, సమయం చూసి సినిమాల్లోకు ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పణవ్ ఎంట్రీపై మోహన్ లాల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగని నటన మోజులో పడి ప్రణవ్ చదువు నిర్లక్ష్యం చేయలేదు. ఊటీలో స్కూలింగ్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ నుండి బిఎ ఫిలాసఫీలో డిగ్రీ పట్టాపొందాడు.ప్రణవ్ చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటాడు. సూపర్ స్టార్ కొడుకునే అనే గర్వం అతడికి లేదని, స్టార్ వారసుడిగా కాకుండా…తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల, కసి అతనిలో ఉందని ప్రణవ్ సన్నిహితులంటుంటారు.
 
3 నటి సీత

తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఫేస్ సీత. తన నటనతో వయస్సుకు సంభందం లేకుండా నెట్టుకొస్తోన్న సీత పుట్టిన రోజు ఈ రోజు. 
విజయనగరం జిల్లా, బొబ్బిలి నుంచి వచ్చిన ఈమె నటిగా, నిర్మాతగా పాపులర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసిన  సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఐదు సంవత్సరాల పాటు హీరోయిన్ గా పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముద్దుల మావయ్య సినిమాలో ఆమె హీరో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది. ఈ పాత్ర ద్వారా ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ  హీరోయిన్స్  ఒకటిగా కొనసాగింది. ఆడదే ఆధారం చిత్రానికి గాను ఆమెకు నంది పురస్కారం లభించింది. పార్థిబన్ ను వివాహం చేసుకున్న తర్వాత నటనలో విరామం తీసుకుంది.  మరల 2002 లో మారన్ అనే తమిళ సినిమాతో  రీఎంట్రీ ఇచ్చింది.  2004 లో తమిళ సినిమా రైటా తప్పా అనే సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది. ఇంద్ర, సంబరం, గంగోత్రి, సింహాద్రి, బన్నీ, వాన, అతడే ఒక సైన్యం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించింది. పర్శనల్ లైఫ్  విషయానికి వస్తే..సీత నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే దత్తపుత్రుడు ఉన్నారు. కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత అనే సినిమాలో నటించింది. ఆమెకు ఈ సినిమాలో నటనకుగాను ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం లభించింది. ఖాళీ సమయాల్లో ఆమె తంజావూరు పెయింటింగ్స్ వేస్తుంటుంది. ఆమె కుమార్తె అభినయకు కూడా ఈ చిత్రకళలో ప్రవేశం ఉంది.

 4 తమిళ సినీ పాటల రచయిత వైరముత్తు

 ప్రముఖ తమిళ కవి వైరముత్తు ఈ రోజే జన్మించారు. ఆయన పాటలకు తమిళనాట వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తికాదు. కవిగా, పాటల రచయితగా, నవలా రచయితగా ఆయనకు తమిళ పరిశ్రమలో తిరుగులేదు. తమిళ సాహిత్య ప్రపంచంలోనూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాస్టర్స్ డిగ్రీ చదువుకున్న ఆయన తొలి రోజుల్లో ట్రాన్సలేటర్ గా చేసేవారు. అదే సమయంలో ఆయన రాసిన కవితలు వివిధ పత్రకల్లో ప్రచురింపబడుతూండేవి. 1980ల్లో ఆయన తమిళ సినీ పరిశ్రమలోకి ప్రవేసించారు.Nizhalgal అనే తమిళ సినిమాకు ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలకు లిరిక్స్ రాసారు. ఆ సినిమాకు భారతీరాజా దర్శకుడు. ఆ తర్వాత వైరముత్తు తిరిగి వెనక్కి చూసుకునే అవసరం లేకుండా పోయింది. తన 40 సంవత్సరాల సినీ కెరీర్ లో దాదాపు 7,500 దాకా పాటలు, కవితలు రాసారు. తన సాహితీ జీవితానికి అనేక జాతీయ అవార్డ్ లు పొందారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, సాహిత్య అవార్డ్ పొందారు. 

 5 అరుణ్ పాండ్యన్

ఒక టైమ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన తమిళ హీరో అరుణ్ పాండ్యన్. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. ఆయన నటించిన  తమిళ సినిమాలు ఓ వర్గానికి తెగ నచ్చేసేవి. దాంతో ఇక్కడతెలుగులో డబ్ చేసి వదిలేవారు. కష్టమ్స్ అధికారి, అధికారి, ఇండియన్ సిటిజన్, కమెండో, నేరం వంటి అనేక యాక్షన్ బేసెడ్ సినిమాలు అలా వచ్చినవే. అలాగే విజయ్ కాంత్ కలిసి నటించిన మరణ మందిరం అనే చిత్రం పెద్ద హిట్ అయ్యి ,పేరు తెచ్చిపెట్టింది. నటన నుంచి రిటైర్ అయ్యాక ఆయన లండన్ బేసెడ్ కంపెనీ అయ్యంగారన్ ఇంటర్నేషనల్ కు చీఫ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయనే సొంతంగా కొన్ని సినిమాలు నిర్మించారు. ఇక తెలుగులో ప్రేమ శిఖరం, నక్షిత్ర పోరాటం,న్యాయ రక్షణ, నేరం, దాడి, దొంగలరాజ్యం వంటి అనేక స్ట్రైయిట్ సినిమాలు చేసారు. 
 
6 prakash mehra

అమితాబ్ కెరీర్ ని మార్చిన చిత్రం జంజీర్ చిత్రానికి ప్రకాష్ మెహ్రా దర్శకుడు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. బ్లాక్ బస్టర్ హిందీ సినిమాలకు ఆయన కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచారు. నిర్మాతగా,దర్శకుడుగా ఉంటూ ఎందరో ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చారు. హిందీలో వచ్చిన మసాలా సినిమాలకు ఆయన పొయినీర్. అమితాబ్ తో ఆయన సినిమా చేసారంటే భాక్స్ బ్రద్దలవ్వాల్సిందే. ఆ కాలం గోల్డెన్ డైరక్టర్స్ లో ఒకరు ప్రకాష్ మెహ్రా.  ప్రకాష్ మెహ్రా లేకపోతే తనకు ఇన్ని క్లాస్ సినమాలు, హిట్ సినిమాలు లేవంటారు అమితాబ్. ఇక హలీవుడ్ లోకు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ డైరక్టర్స్ లో మొదటివాడు ప్రకాష్ మెహ్రా. లేట్ ఎయిటీస్ లో హాలీవుడ్ సంస్దతో కలిసి జాయింట్ వెంచర్ గా ది గాడ్ కనెక్షన్ అనే సినిమా చేసారు. ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ కలిసిపోయి కనిపిస్తారు.  బిగ్‌బీ అమితాబ్‌ గుర్తింపుకోసం చిత్రసీమలో పోరాడుతున్న సమయంలో తన జంజీర్‌ చిత్రంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. దీంతో అమితాబ్‌ కు స్టార్‌ డమ్‌ తెచ్చి పెట్టారు. ఆ చిత్ర అఖండ విజయంతో అమితాబ్‌ ప్రముఖహీరోగా మారిపోయారు. అనంతరం ఆయన అమితాబ్‌ తోనే ముకద్దర్‌ కా సికందర్‌, లావారిస్‌, నమక్‌ హలాల్‌, షరాబీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. జంజీర్‌ లోని విజయ్‌ అనే పేరు అమితాబ్‌ 19 సినిమాల్లో నిర్మాతలు వాడారు. అవన్నీ విజయవంతం కావటం విశేషం.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com