Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 రాజ్‌నాథ్‌ సింగ్‌

ఈ రోజు బీజేపీ సీనియర్‌ నేత.. ఓ చేతి లో నీతి.. మరో చేతిలో ‘రాజనీతి’.. పట్టుకుని ప్రతిపక్షాలకు అన్ని వేళలో దీటుగా ఎదుర్కొనే ధీశాలి..రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ రోజే జన్మించారు. చూడటానికి గంభీరంగా కనిపి స్తూ.. దేశంలో నెలకొన్న ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా.. సులువు గా గట్టెక్కిం చ గల వ్యూహకర్త… భారతదేశం లో కనిపించే అతికొద్ది మంది ప్రముఖ బీజేపీ నేతల్లో ఈయన ఒకరు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా తన రాజకీయ జీవి తాన్ని ప్రారంభించి రక్షణ శాఖ మంత్రిగా దేశానికి సేవ చేస్తున్న ఆయనే.. రాజ్‌నాథ్‌ సింగ్‌. రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పిన… ‘రాజ్‌ నీతి మే.. నీతి హై… తో అనీతి క్యో…!’ అనేది జీవితంలోని ఓ ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో హోంశాఖ మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పని చేసారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పుడే ఆయన ఎంతో పాపులర్‌ అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నికల్లో పాల్గొనకుండా ముందుండి పోరాడారు. హోంశా ఖ మంత్రిగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో పంచాయతీ ఎన్ని కలు నిర్వహించారు. తనకంటూ ఓ మార్క్‌ను వదిలివెళ్లారు. దీంతో దశాబ్దాల కాలం నాటి సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం చూపారు.దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఉత్సాహం రాజ్‌నాథ్‌ సింగ్‌లో ఉం టుంది. దీని కోసం ఆయన ఓటర్లతో మాట్లాడుతారు. అదేవిధంగా ప్రజల మధ్యకు వెళ్లి విషయాలు తెలుసుకుంటారు. అంత గొప్ప నాయుకుడు ఈ భారతదేశంలో జన్మించటం మన అదృష్టం.

2 సునీల్ గావాస్కర్
ఈ రోజునే ప్రముఖ క్రికెటర్ సునీల్ మనోహర్ గావాస్కర్ జన్మించారు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్. 1970′, 1980′ దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు .1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని వరల్డ్ కప్ సాధించిన జట్టులో గవాస్కర్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాలో 1985లో జరిగిన బేసన్ అండ్ హెడ్గేస్ వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ గెలిచిన జట్టు కెప్టెన్ గా ఉన్నారు. కెరీర్‌లో 125 టెస్టు మ్యాచ్‌లాడిన గవాస్కర్ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 3 వేల పరుగులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికానప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. భారత క్రికెట్‌తో సునీల్ గవాస్కర్‌కు 50 ఏళ్ల అనుబంధం ఉంది.

3 కోట శ్రీనివాసరావు
సినిమా ప‌రిశ్ర‌మ ఎలాంటిదంటే గుమ్మ‌డికాయంత టాలెంట్ ఉన్నప్ప‌టికీ , ఆవ‌గింజంత అదృష్టం త‌ప్ప‌కుండా ఉండాలి అని చెప్పే కోట శ్రీనివాసరావు ఈ రోజునే జన్మించారు. తెలుగు తెరకు లభించిన గొప్ప వరం కోట శ్రీనివాసరావు. రౌద్రం, రాజకీయ కపటత్వం, ఆవేదన, హాస్యం, మధ్యతరగతి మందహాసం, … ఆయన జీవితమే ఓ ప్రతిఘటన.నటనలోనూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్న నటుడు. బ్యాంక్‌ ఉద్యోగినైన అయిన ఆయన నటనతో ఈ స్థాయికి చేరతానని ఊహించలేదు. రవీంద్రభారతిలో ఓ నాటకం వేస్తున్నారు. దానికి సి.ఎస్‌.రావు దర్శకుడు. అందులో ఆయన వేషం చూసి 1978లో క్రాంతికుమార్‌ తను నిర్మించిన ‘ప్రాణంఖరీదు’ చిత్రంలో ఓ పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమాతో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తున్న ఆయన అనుకోకుండా నటుడిగా మారాను.చిరంజీవితో చేసిన ప్రాణం ఖరీదు తర్వాత అమరజీవి, బాబాయ్‌ అబ్బాయ్‌, మావూరి దేవత చిత్రాల్లో నటించారు.

ఆ తర్వాత చేసిన ప్రతిఘటన నటుడిగా కెరీర్‌ని మలుపు తిప్పింది.తెలంగాణ యాసలో ఆయన పండించిన విలనిజమ్ అందరినీ ఆకట్టుకోవడంతో ఆ సినిమా తర్వాత నటుడిగా బిజీ అయ్యారు. నటుడిగా నాకంటూ ప్రత్యేకత సంతరించుకోగలిగారు.విలన్ పాత్రల్లో జీవించే ఆయనకు ‘ఇంట్లో ఇల్లాలు-వంటిల్లో ప్రియురాలు’ బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాలు కోట కరుణ రసాత్మక పాత్రల్లో కూడా మెప్పించగలడని నిరూపించాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూసి చాలామంది స్టార్‌లు ఆయకు ఫోన్‌ చేసి అభినందించడం మర్చిపోలేనంటారాయన.

ఏ పాత్రైనా తన ముందు మోకరిల్లాల్సిందే అన్నంతగా.. అవలీలగా నటించే సహజ నటుడు కోట శ్రీనివాస రావు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర యాసల్లో డైలాగులు ఎలాంటి తడబాటు లేకుండా ధారాళంగా చెప్పగలగే ఏకైనా నటుడు కోట. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ ఇలా అన్ని దక్షిణాది భాషల్లో సుమారు 500లకుపైగా చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల నట జీవితంలో ఆరు నంది అవార్డులు ఆయన ముందు తలొంచ్చాయి. సైమా అవార్డులు, అల్లు రామలింగయ్య పురస్కారం ఇలా అనేక అవార్డులు అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విశిష్ట అవార్డు ‘పద్మశ్రీ’ వరించింది.

4 ఆనం రామనారాయణరెడ్డి
ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి జన్మించారు . భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ సభ్యుడు అయిన రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఈయన ఎన్.టి. రామారావు యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com