Banner
banner

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Arunima sinha


అరుణిమా సిన్హా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్, వాలీబాల్‌ ప్లేయర్‌. ఇప్పుడు పర్వతారోహకురాలు. పంచంలోనే ఎవరెస్టును ఎక్కిన తొలి  మహిళగా రికార్డు సాధించారు! ఈ రోజు ఆమె పుట్టిన రోజు. అరుణిమ 2013, మే 21వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు.  ఒక ఘర్షణలో ప్రమాదవశాత్తూ కాలిని (ఎడమ) పోగొట్టుకున్న అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే తొలిసారి ఎవరెస్టును ఎక్కిన వికలాంగ మహిళగా రికార్డు సాధించారు.  ఆ తర్వాత అనేక రికార్డులకు ఆమె గౌరవాన్ని తెచ్చారు. మొదట 2012లో హిమాలయాల్లోని ఐలాండ్‌ పీక్‌ను అధిరోహించి, ఫిట్‌నెస్‌ విషయంలో నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఏడాది ఎవరెస్టును అధిరోహించింది. ఆఫ్రికాలో కిలిమంజరో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో, సౌత్‌ అమెరికాలోని ఆకాంకాగువా, ఇండోనేసియాలో కార్‌స్టెంజ్‌ పిరమిడ్‌లను అధిరోహించారు. ఈ పర్వతాలన్నీ ఆమె స్ఫూర్తి ముందు తలవంచాయి. ఇప్పుడు ఆమె దీక్షకు గుర్తింపుగా యుకెలోని స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్సిటీ పురస్కరించింది. గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.  ఆ అనుభవాలను ‘బార్న్‌ అగైన్‌ ఆన్‌ ద మౌంటెయిన్‌’ అని పుస్తకంగా రాసింది అరుణిమ. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తోపాటు టెన్సింగ్‌ నార్గే అవార్డులతో అరుణిమలోని స్ఫూర్తిని గౌరవించింది.ఆమె స్వచ్ఛందంగా అరుణిమ ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. స్పెషల్లీ ఏబుల్డ్‌ పీపుల్‌కి మానసిక, శారీరక ఆరోగ్య సేవలతోపాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం, మహిళల సాధికారత అవగాహన వంటి కార్యక్రమాలను తన చారిటీ ద్వారా నిర్వహిస్తోంది.

2 S.J Surya

ఎస్.జె.సూర్య పేరు వింటే వెంటనే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ గుర్తొస్తుంది. ఆ తర్వాత మహేష్ తో చేసిన నాని గుర్తు వస్తుంది. అలాగే మరో సారి పవన్ తో కొమరం పులి సినిమా చేసారు. హిట్, ఫ్లాప్ లు ప్రక్కన పెడితే విభిన్నంతకు, వైవిధ్యానికి చోటు ఇచ్చే ఇటువంటి సినిమాను డైరెక్ట్ చేసిన ఈయన పుట్టిన రోజు ఈ రోజు. ఆయన కేవలం డైరక్టర్ గానే కాదు గత కొంతకాలం నుండి నటుడిగా మంచి పాత్రలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తెలుగులో స్పైడర్ సినిమాలో నెగటివ్ రోల్ చేసి క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసుకున్నాడు సూర్య.  స్పైడర్ సినిమాలో భైరవుడు గా విలనీతో ఆకట్టుకున్నాడు. సూర్య నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా  కొనసాగుతున్న రోజుల్లోనే నటనపై మక్కువతో నటనలో ప్రవేశించి పెద్ద సక్సెసయ్యారు.  ఎస్.జె.సూర్య ప్రస్తుతం  కోలీవుడ్ సహా టాలీవుడ్ హీరోలకు విలన్ గా నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు.  వరుస సినిమాలతో నటుడిగా కొనసాగుతున్న ఈయన ‘మానస్టర్’ అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేశాడు.  ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సూర్య మధ్యతరగతి వ్యక్తిగా ఒక ఎలుక వల్ల కష్టాలు పడే పాత్రలో నటించి మెప్పించారు. సినిమాలో సూర్య నటనకు క్రిటిక్స్ కూడా జేజేలు పలికారు. ప్రస్తుతం అ ప్రస్తుతం సూర్య కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో అతని చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయట.

3 Rajendra Kumar Tuli

యాభైల నాటి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రాజేంద్రకుమార్ జయంతి ఈ రోజు. ఆయన ఈ రోజ జన్మించారు. తన కెరీర్ లో ఎనభై కు పైగా సినిమాలు నటించారు. నాలుగు దశాబ్దాలు పాటు తనదైన శైలిలో అభిమానులను అలరించారు. ఆయనకు జూబ్లీ స్టార్, ట్రాజడీ కింగ్ అనే బిరుదులు ఉండేవి. అరవైలలో ఎక్కువ శాతం సూపర్ హిట్స్ ఇచ్చిన హీరో ఈయన . రాజేంద్రకుమార్ కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగానూ ప్రసిద్దుడు.  తన కుమారుడు కుమార్ గౌరవ్ తో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1969లో ఆనకు పద్మశ్రీ బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన కెరీర్ లో మదర్ ఇండియా, అర్జూ, లవ్ స్టోరీ, ది ట్రైన్, దిల్ ఏక్ మందిర్, ధూల్ కా పూల్, ఘర్ సంసార్, పతంగ్ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికి ఆయన అభిమాన సంఘాలు ఆయన పుట్టిన రోజుని జరుపుతూనే ఉండటం విశేషం.

4 గ్రేసీ సింగ్


 తెలుగులో నాగార్జున తో  ‘సంతోషం’ అనే టైటిల్ తో వచ్చిన సూపర్ హిట్ సినిమాలో నటించింది గ్రేసీ సింగ్ పుట్టిన రోజు ఈ రోజు. గ్రేసీసింగ్‌… తెలుగువారికి ఈ పేరు ఎంతవరకూ గుర్తుందో తెలీదు కానీ ‘సంతోషం’ సినిమాలో హీరోయిన్‌ అంటే మాత్రం టక్కున గుర్తుకొచ్చేస్తుంది. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారుకి కిర్రాకు పుట్టించింది మరి.  ఆ సినిమా తర్వాత మోహన్ బాబుతో ‘అప్పు చేసి పప్పు కూడు’ అనే ఇంకో సినిమా కూడా చేసింది. ఆ తర్వాత మాత్రం ఆమె కనిపించలేదు. బాలీవుడ్లో అమీర్ ఖాన్ చిత్రం లగాన్.. సంజయ్ దత్ తో  మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన ఘనత ఆమెది. అంత పెద్ద హిట్స్ లో చేసినప్పటికీ గ్రేసీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

గ్రేసీ మళ్లీ రీఎంట్రీ ఇస్తూ.. రామ్ హీరో గా వచ్చిన  ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాతో మరోసారి తెలుగు తెరమీద కనిపించిందంతే. అయితే అది నడవకపోవటంతో రీ ఎంట్రీ వృధా అయ్యిపోయింది. ఇంతకీ ఇప్పుడేం చేస్తోందంటారా… గతేడాది వరకూ ‘సంతోషీ మా’ అనే హిందీ సీరియల్‌లో అమ్మవారిగా కనిపించింది. గ్రేసీ భరతనాట్యం డాన్సర్‌ కూడా. అందుకే, ‘గ్రేసీ సింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’ని ప్రారంభించి భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తోంది. దీనికితోడు తరచూ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ఈమధ్యే ముంబైలోని ఓ వీధిని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వీధుల్లోని గోడలకు రంగులేస్తూ కనిపించింది. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ వారి కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.

5 నసీరుద్దీన్‌ షా


అలాగే ఈ రోజు విలక్షణమైన నటనకు ప్రతిరూపంలాంటి నసీరుద్దీన్‌ షా జన్మించారు. బాలీవుడ్‌లో  క్యారక్టర్‌ నటుడిగా గుర్తింపు పొందిన చదవుకునేరోజుల్లోనే  నాటకాల మీద ఆసక్తితో 1971లో ఢిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లో చేరి నటనలో మెళకువలు నేర్చుకున్నారు. తర్వాతే పూణేలోని ‘ఫిలిం మరియు టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’లో చేరి నటనపై మెరుగులు దిద్దుకున్నారు. 1978లో బాపు-రమణలు తెలుగులో నిర్మించిన కృష్ణంరాజు చిత్రం ‘మనవూరి పాండవులు’ను బోనీ కపూర్‌ నిర్మాతగా హిందీలో తొలిసారి ‘హమ్‌ పాంచ్‌’ పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు బాపు. సంజీవ్‌ కుమార్‌, షబానా ఆజ్మి, మిథున్‌ చక్రవర్తి, రాజబబ్బార్‌, గుల్షన్‌ గ్రోవర్‌, అమ్రీష్‌ పురి నటించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ తెలుగులో మురళీమోహన్‌ ధరించిన పాత్రను పోషించాడు. అందులో మంచి పేరొచ్చింది. తరవాత ఇస్మాయిల్‌ షరాఫ్‌ దర్శకత్వం వహించిన ‘దిల్‌ అఖిర్‌ దిల్‌ హై’ (1982) సినిమాలో రాఖీ సరసన నటించాడు.

ఆ తర్వాతి సంవత్సరం విడుదలైన ‘మాసూమ్’లో షబానా ఆజ్మి సరసన నటించిన నసీరుద్దీన్‌ షాను ఫిలింఫేర్‌ వారు ఉత్తమ నటుడుగా ఎంపిక చేశారు. శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏకంగా 5 ఫిలింఫేర్‌ బహుమతులు దక్కడంతో నసీరుద్దీన్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. 1986లో సుభాష్‌ ఘాయ్‌ దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమా ‘కర్మా’లో ఖైరుద్దీన్‌ పాత్రను దిలీప్‌ కుమార్‌తో సమానంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో తొలిసారి నూతన్‌, దిలీప్‌ కుమార్‌ సరసన హీరోయిన్‌గా నటించింది.అలా బాలీవుడ్ లో హీరో పాత్రలు చేస్తూ.. మర్చంట్‌ ఐవరీ వారి ‘ది పర్ఫెక్ట్‌ మర్డర్‌’ అనే ఆంగ్ల సినిమాలో హీరోగా ఇనస్పెక్టర్‌ పాత్రను అమోఘంగా పోషించి పేరుగడించారు. లండన్‌ నగరంలో ఈ సినిమా బాగా ఆడింది.

అలాగే  సందేశాత్మక చిత్రాల్లో మంచి పాత్రలు పోషించాలనే ఆశయంతో కమల్‌ హాసన్‌ నిర్మించిన ‘హే రామ్’ సినిమాలో మహాత్మా గాంధి పాత్రను పోషించాడు. రిచర్డ్‌ అటెన్‌బరో నిర్మించిన ఆస్కార్‌ అవార్డుల సినిమా ‘గాంధి’ చిత్రంలో మహాత్మా గాంధి పాత్రధారి బెన్‌ కింగ్స్‌లేకు డబ్బింగ్‌ చెప్పింది నసీరుద్దీనే. 2006లో ఆస్కార్‌ బహుమతి కోసం భారతీయ ఎంట్రీ ‘పహేలి’ చిత్రానికి సమన్వయకర్త పాత్రను పోషించింది కూడా నసీరుద్దీనే. దేశం గర్వించదగ్గ ఈ నటుణ్ణి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’, ‘పద్మ భూషణ్‌’ బిరుదులతో సత్కరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి

Banner
, , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com