ప్రముఖ సంస్థ టీవీఎస్ గ్రూప్ తో యాభై సంవత్సరాలకు పైగా అశోశియోట్ అయ్యిన టిటి రంగస్వామి (97) మృతి చెందారు. ఆయన టీవీఎస్ గ్రూప్ కు చెందిన అనేక కంపెనీలు లూకాస్ టీవిఎస్, బ్రాక్స్ ఇండియా, టార్బో ఎనర్జీతో అశోశియోట్ అయ్యారు. సుందరం ఫైనాన్స్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ టిటి శ్రీనివాస రాఘవన్ కు తండ్రి ఈయన. టిటి రంగస్వామి ప్రొఫెషనల్ గా మూడు డిగ్రీలు ఉన్నాయి. చార్టెడ్ ఎక్కౌంటెంట్ గా, కాస్ట్ ఎక్కౌంటెంట్ గా, కంపెనీ సెక్రటరీగా ఆయన డిగ్రీలు చేసారు.
ఇండస్ట్రియల్ రెవిల్యూషన్ వచ్చినప్పుడు చెన్నైలోని పాడిలో టీవిఎస్ గ్రూప్ అనేక సంస్దలు స్దాపించింది. 1954లో సుందరం ఫైనాన్స్‌ని స్థాపించి, అనేక స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన టిఎస్ సంతానం, టివిఎస్ గ్రూప్ ద్వారా అనేక మాన్యుపేక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసారు. అప్పుడు ముంబై టిటిఆర్లో అప్పుడు స్టాండర్డ్ వాక్యూమ్ ఆయిల్ కంపెనీ పనిచేస్తున్న రంగస్వామిని తీసుకొచ్చారు. ఆ తర్వాత 1960లు మరియు 1970లు TVS గ్రూప్‌లోని కంపెనీలు ఆయన ఆధ్వర్యంలో దూసుకుపోయాయి.
ఆ తర్వాత రంగస్వామి ఆ సంస్దకు ఓ విశ్వసనీయమైన ప్రాపర్టీగా మారారు. అతను నేర్పరితనం, తెలివితో సంస్దని అభివృధ్ది పధంలో ప్రయాణింప చేసారు. తన పదునైన జ్ఞాపకశక్తితో పరిపూర్ణమైన ప్రొఫెషనల్‌గా పేరు తెచ్చుకున్నారు. TTR బ్రేక్స్ ఇండియా నుండి ED-ఫైనాన్స్ మరియు కంపెనీ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు.
“మా నాన్న ఫైనాన్స్‌లో ఉన్నప్పటికీ, ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఒక ముఖ్యమైన క్వాలిటీగా చూశారు. ప్రజలకు మొదటి స్థానం ఇవ్వడం ఆయన నుంచే నేర్చుకున్నాను’ అని ఆయన కుమారుడు టీటీఎస్ చెప్పారు.
“ఎల్లప్పుడూ చట్టానికి లోబడి విలువలను రాజీ పడకుండా ఆయన ముందుకు వెళ్ళేవారు. రంగస్వామి ఆర్థిక మరియు అకౌంటింగ్ విషయాలనూ చూస్తూ.. సంస్దలో ఇంటిగ్రెటీ ని పెంపొందించేవారు. ఆయన చాలా వినూత్నంగా ఉండేవారు. ఏదైనా సమస్య వస్తే తనదైన పరిష్కారాలతో ముందుకు వెళ్ళే మార్గాన్ని కనుగొనేవారు, ,” బ్రేక్స్ ఇండియా చైర్మన్ ఎస్ విజీ తెలిపారు. ఆయనకు విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. ఒత్తిడిని తనపై పడనిచ్చేవారు కాదు. మంచి మానవతా వాది కూడా. ఆయన వలన లబ్ది పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఈ రోజు మా మధ్య లేకపోవటం పెద్ద లోటు అని వ్యాఖ్యానించారు.