ఎన్జీరంగా రాజకీయ భావజాలంతో ఎదిగి, తన వాదనా పటిమతో, అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి, దక్షిణాదిన..ప్రత్యేకించి తెలుగునాట వైశ్య రాజకీయ ప్రతినిధిగా ప్రాచుర్యం పొందిన కొనిజేటి రోశయ్యగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ అరుదైన రాజకీయవేత్త…అంతకు ముందు ఎన్నో పదవులు చేపట్టినా , వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆయన ప్రాధాన్యత పెరిగిందనేది ఒప్పుకోవాల్సిన నిజం. 
ఓ సీనియర్ ఆర్దిక మంత్రిగా..వైయస్ ఆర్ కీలక మంత్రి వర్గ సహచరుడుగా ప్రాముఖ్యత సంపాదించిన ఆయన వైయస్ పథకాలకు డబ్బు సర్దుబాటు చేయటం, లెక్కల్లో నిక్కచ్చితనంతో అనతికాలంలోనే అత్యంతప్రీతిపాత్రుడుగా మారిపోయారు. వివాదరహితుడైన ఆయన వైయస్ మరణం  తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన్ను ప్రకటించినా, ఆ తర్వాత  వద్దనుకున్నా హుందాగా తప్పుకుని తమిళనాడుకి గవర్నర్ గా వెళ్లిపోయారు. వ్యక్తిగతంగా ఆయనికి  వైయస్ అంటే అమితాభిమానం. అది ఆయన ప్రతీ మాటలోనూ కనపడుతుంది. సినిమా రంగంలో బాపు-రమణ ద్వయంలాగ వైయస్, రోశయ్య కాంబినేషన్ అని చెప్పుకుంటూంటారు.  
తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ సుమన్ టీవిలో ఆయన ఇంటర్వూ వచ్చింది. అందులో ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైయస్ ఆర్ గారు లేకపోవటం పెద్ద వెలితే అంటారు. రాజశేఖర్ గారు ఆయన్ని అన్నా అని పిలిచారు. రాజశేఖర్ రెడ్డిగారు బరువు, భాధ్యతలు మోయటానికి ఇష్టపడేవారు.మరీ ఎప్పుడో గానీ ఇబ్బందికర పరిస్దితులు వస్తే తప్ప…  జోక్యం చేసుకోమని అడిగేవారు కాదంటారు. ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో ముచ్చటించారు చూడండి.

Similar Posts
Latest Posts from Vartalu.com