Banner
banner
banner

ఇవాళా రేపు, ప్రతీ చిన్న విషయానికి   ప్రతీ టీవి ఛానెల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో లైవ్ అంటే ప్రత్యక్ష్య ప్రసారం ఇవ్వటం కామన్ అయ్యిపోయ్యింది. ముఖ్యంగా టీ వీ చానెళ్లు ఎప్పుడూ  ఏదో ఒక సంచలన వార్త అంటూ ప్రసారం చేసి..జనాల జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నాయనేది నిజం. 
ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికితే సంబంధిత మిగతా వివరాలు కూడా తెలియక ముందే ప్రత్యక్ష్య ప్రసారమనో,, చర్చ అనో..ఎక్స్క్లూజివ్ అనో ప్రసారం చేస్తూ..తరువాత మేమే దాన్ని వెలికి తీసింది అంటూ క్రెడిట్ ఇచ్చుకుంటున్నారు.దానికి తోడు ప్రతీ ఛానెల్ ఏదో ఒక పార్టీకు కొమ్ము కాస్తూండటంతో వార్తలకు నిబద్దత అనేది లేకుండా పోయింది. ఇక  సోషల్ మీడియా సైతం తన దైన శైలిలో అబద్దాలో ,నిజాలో తెలియకుండా కామెంట్స్ ,షేర్స్ తో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తోంది. 
ఈ నేపధ్యంలో సామాన్యుడు… అసలు తాము విని, చూసి, చదివే వార్తల్లో  ఏది నిజం..ఏది అబద్దం, ఏది కరెక్ట్..ఏది తప్పు అర్దంకాని పరిస్దితికి చేరుకున్నాడు. వీటిన్నటికన్నా భిన్నంగా  నిష్పక్షపాతంగా వార్తలను ఇస్తూ ముందుకు వెల్తోంది కేవలం ..దూరదర్శన్ మాత్రమే. వారి ఛానెల్ ని ఇదిగో ఇక్కడ ఈ లింక్ ద్వారా చూసి, ఏ విధమైన ఎవరి ప్రభావం లేని వార్తలు చూడవచ్చు.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner