Banner
banner
KCR
banner
Banner
banner

తెలంగాణా ప్రభుత్వం ఉగాది కానుక గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ చేయని ప్రయోగం తెలంగాణా ప్రభుత్వం చేసింది.  తీయనైన తెలుగు – తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కరదీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేసేందుకు భాషా, సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. 
68 పేజీలతో కూడిన కర దీపికలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తిథులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, వర్ణమాల, కార్తెలు, ప్రాచీణ కాలగమనం, రాష్ట్ర చిహ్నాలు, కళలు, పండుగలు, పాటలు, ఆటలు, నీతి పద్యాలు ఇలా 20 రకాల అంశాలతో కూడిన కర దీపికను దేశపతి శ్రీనివాస్‌ ఆద్వర్యంలో సిద్ధం చేశారు. తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్‌ చేసిన సూచన మేరకు తెలంగాణ తెలుగును పరిచయం చేసే కోణంలో ఈ కరదీపిక సిద్ధం చేశారు.
 ఉగాది పండగ సందర్భంగా మార్చి 18 కల్లా కరదీపికను ప్రతి ఇంటికి చేరవేయటమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసి, యుద్ద ప్రాతిపదికగా అందచేసారు. అంతేకాకుండా ఈ కరదీపిక ప్రతిని వాట్సప్ ద్వారా చాలా మంది షేర్ చేస్తున్నారు.  ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు 80 లక్షల పుస్తకాలను పంపించినట్లు భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరిక్రిష్ణ ప్రకటించారు.  మిగతా 30లక్షల పుస్తకాలను స్థానికంగా జిల్లా స్థాయిలో ముద్రించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలు సైతం జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మహిళా,శిశు సంక్షేమ సిబ్బంది ద్వారా ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
మీరు ఇక్కడ ఆ అమూల్యమైన కరదీపిక డిజిటల్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner