Banner
banner
banner

సుమారు 650కి పైగా చిత్రాల్లో నటించి, రచయితగానూ, దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్న ‘మణి’ తనికెళ్ల భరణి. వృత్తిపరంగా ఆయన ఎంత ప్రత్యేకంగా ఉంటారో…వ్యక్తిగతంగానూ అదే స్దాయిలో ఆధ్యాత్మిక శోభతో వెలుగుతూ ఉంటారు. శివ భక్తుడు అయిన ఆయన రాసిన ‘ఆటకదరా శివ’ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి తనకు శివుని పై భక్తిని చాటుకున్నారు. SivaTattva.com , TvShiva.com పేరుతో ప్రారంభమైన రెండు యూట్యూబ్ ఛానెల్స్ ని,వెబ్ సైట్స్ ని ఆయన మరో సీనియర్ నటుడు, రచయిత అయిన రావికొండలరావు గారితో కలిసి ఆవిష్కరించారు. ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో తరించే కార్తీక మాసంలో ఈ ఈవెంట్ జరగటం విశేషం.

తణికెళ్ల భరిణి మాట్లాడుతూ…తమవంటి శివ భక్తులకి ఈ వెబ్ సైట్ చాలా ఉపయోగపడుతుందని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మక భావం పెరిగితే అది ప్రపంచ శాంతికి తోర్పడుతుందని చెప్పారు. ఈ వెబ్ సైట్ రూపొందించిన సాప్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత, సింధులను ప్రత్యేకంగా భరణిగారు అభినందించారు.

రావికొండలరావు గారు మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రపంచం అంతా యుట్యూబ్ లో నిక్షిప్తమవుతోందని, యూత్ కూడా తమ సెల్ ఫోన్స్ లో రెగ్యులర్ గా యూట్యూబ్ ని ఫాలో అవుతున్నారని, కాబట్టి వారిని రీచ్ అవటానికి అక్కడికే వెళ్లి శివతత్వాన్ని బోధించాలనే ఆలోచన చాలా బాగుందని అన్నారు. అలాగే తాను ఈ ఛానెల్ లో శివ భక్తి గీతాలు, స్త్రోత్రాలు విన్నానని, అవి చాలా మధురంగా ఉన్నాయని,భక్తిపాటలతో తన్మయత్వం చెందానని, వింటూంటే మనస్సు ప్రశాంతంగా ఉందని, ప్రతీ ఒక్కరూ ఇలాంటివి విని, చూడాలని అన్నారు.

banner

చెన్నై కి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ERP సాప్ట్ సిస్టమ్స్ లిమెటెడ్ వారు ఈ రెండు యూట్యూబ్ మరియు వెబ్ పోర్టర్స్ ని రూపొందించారు. ప్రజల్లో శివతత్వాన్ని పెంపొందించటానికి గానూ ఈ రెండు వెబ్ సైట్స్ ,యూట్యూబ్ ఛానెల్స్ పనిచేస్తాయని సంస్ద ప్రతినిధి , ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శతకోపం కృష్ణవేణి గారు అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్, బాల గాయని ప్రవస్తి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు ప్రస్తుతం లైవ్ లో ఉన్న www.tvshiva.com , www.Shivatattva.com ని చూడండి

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner