Banner
banner
banner
Banner
banner

విజయవాడలో  అతిపెద్ద కాంచీపురం గౌరి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం బుధవారం రోజున అంగరంగ వైభవంగా  జరిగింది. పెళ్లి పట్టు చీరలకు  ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిల్క్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిశుడు)   తన దివ్యమైన హస్తాలతో  శుభప్రదంగా  ప్రారంభించి, రెండు తెలుగు  రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు ఓకే ఒక వేదిక కాంచీపురం గౌరి సిల్క్స్ అని పేర్కొన్నారు.

స్వచ్ఛమైన విలక్షణమైన కంచి పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు విజయవాడ వస్త్ర అభిమానులకు గౌరి  సిల్క్స్ అందుబాటులోకి తెచ్చింది మగువల మనసులు దోచే కంచి పట్టు వస్త్రాలను అందుబాటు ధరలకే  విక్రయించేందుకు గాను గౌరి సిల్క్స్ ని బుధవారం విజయవాడ మొగలాజపురం లోని యం.జి.రోడ్డు పివిపి లేన్ లో  ప్రారంభించారు.
 షోరూం ప్రతినిధులు  గుర్రం మురళి గారు.


 మాట్లాడుతూ గౌరి సిల్క్స్ లో స్వచ్ఛమైన ఒరిజినల్ కాంచీపురం పట్టు వస్త్రాలను అందరికి అందుబాటు ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ కంచికి వెళ్లకుండా..మన  విజయవాడకు వస్తారని పేర్కొన్నారు. కంచి, ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు గౌరి సిల్క్స్ లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.  గౌరి సిల్క్స్ అన్ని  వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాలు అందుబాటు ధరలకే అందిస్తున్నామని ఈ చక్కటి అవకాశాన్ని  విజయవాడ ప్రాంతవాసులు వినియోగించుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.

banner
Banner
, ,
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner