మహాత్మునిపై పుస్తకం రిలీజ్ చేస్తున్న మోహన్ భగవత్

గాంధీజీ ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ రాశారు. ఇప్పటికీ ప్రపంచంలోని లక్షలాంది మందికి ఆయన ఆత్మకథ స్ఫూర్తిగా నిలుస్తోంది. గాంధీజీ జీవితాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.భారత్‌లో మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ ఆత్మకథకు ఎంతో ఆదరణ లభిస్తోంది. పాకిస్తాన్‌లో కూడా బెస్ట్ సెల్లెర్స్ జాబితాలో ఆ పుస్తకం ఉందంటే..ఆ  ప్రభావం ఏ స్దాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన గురించిన అనేక విశేషాలు, విషయాలకు సంభందించిన పుస్తకాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో పుస్తకం లాంచ్ కు సిద్దమైంది.  ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ..మహాత్మాగాంధీపై రాసిన ఓ పుస్తకాన్ని న్యూదిల్లీలో న్యూ ఇయిర్ రోజైన జనవరి1 న విడుదల చేయనున్నారు.  ఆ పుస్తకం పేరు Making of a Hindu Patriot: Background of Gandhijis Hind Swaraj. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఖరారు చేసారు. ఆయన కూడా ఈ పుస్తకం లాంచింగ్ కు హాజరుకానున్నారు. అలాగే విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ కూడా ఈ లాంచ్ కు విచ్చేస్తారని తెలియచేసారు. ఈ పుస్తకాన్ని హర్ ఆనంద్ వారు పబ్లిష్ చేసారు. వెయ్యిపేజీలు కల ఈ పుస్తకాన్ని జెకె బాలాజి, ఎమ్ డి శ్రీనివాస్ కలిసి అకడమిక్ స్టడీ కోసం రచించినట్లు తెలిపారు. చాలా కాలం క్రితమే ఈ పుస్తకం రాసినప్పటినప్పటికు అఫీషియల్ గా లాంచ్ చేయలేదన్నారు. మొన్న మహాత్మా గాంధీ 151 యానవర్శరీకు విడుదల చేద్దామనుకున్నా కరోనాతో ఈ పోగ్రామ్ ని ఆపాల్సి వచ్చిందని తెలియచేసారు. ఈ పుస్తకాన్ని గుజరాతి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచామని అన్నారు. 2011లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ,మోహన్ భగవత్ విడుదల చేసారన్నారు. మహా రచయిత టాల్ స్టాయి తో గాంధీ 1909 -1910 మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని అప్పుడు టాల్ స్టాయి మహాత్ముని గురించి వాడిన పదమే “Hindu Patriot” అని దాన్ని తీసుకునే తమ పుస్తకానికి టైటిల్ గా పెట్టామని అన్నారు.  ఇక ఈ పుస్తకంలో హిందూ స్వరాజ్య పరిణామ క్రమంని చర్చిస్తూ సాగుతుంది. మనకాలంలో ఉన్నటువంటి హిందూ దేశభక్తుడుగా గాంధీని అభివర్ణిస్తుందని పబ్లిషర్స్ చెప్తున్నారు. గాంధీజీ మాటలను ఉదహిస్తూ ఈ పుస్తకం సాగుతుంది. ఈ పుస్తకం సత్యాగ్రహం పుట్టుక గురించి చెప్తుంది. సెప్టెంబర్ 11,1906 దక్షిణ ఆఫ్రికా  జోహన్ బర్గ్ లో సత్యాగ్రహం మొదలెట్టారు. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ, ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. ఆ తర్వాత స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. ఈ వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచామని పబ్లిషర్స్ చెప్తున్నారు.