తెలుగు కథకు పెద్ద దిక్కు వెళ్లిపోయింది

Updated: May 19, 2018 12:21:41 PM (IST)

Estimated Reading Time: 3 minutes, 12 seconds

తెలుగు కథకు పెద్ద దిక్కు వెళ్లిపోయింది

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూయటం సాహిత్యాభిమానులకు తీరనిలోటే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.  చక్రనేమి’ కథతో సాహితీ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బరామయ్య 200కు పైగా కథలు రాశారు... అనేక అవార్డులు అందుకున్నారు.

1938లో గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య చిన్నతనంలోనే తండ్రిని..తదనంతంరం అన్నయ్యని  పోగొట్టుకున్నారు.   అటు పాఠ్యపుస్తకాలు, ఇటు సాహిత్యమూ ఆయన్ని ఆ శోకం నుంచి కాపాడాయి...అంతేకాదు.. జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి.   విశ్వనాథ సత్యనారాయణవంటి పెద్దల సాన్నిహిత్యం కూడా ఆయన సాహిత్య జీవితానికి  ప్రేరణనిచ్చింది. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో 40 ఏళ్లపాటు అధ్యాపకునిగా పనిచేసిన ఆయన...ఒక పక్క విద్యార్థులకు తెలుగుని బోధిస్తూనే మరోపక్క అదే తెలుగు సాహిత్యంలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్నారు. 

సాహిత్య జీవితానికి వస్తే.. 1959లో సుబ్బరామయ్యగారి తొలి కథ ‘చక్రనేమి’ అచ్చయ్యిన నాటి నుంచి ఆగకుండ రాస్తూనే ఉన్నారు. ఆ కథలు ఒకదానితో మరొకటి పొంతన లేనట్లు కనిపించటం ఆయన సృజనలో ఓ స్పెషాలిటీ. అలాగే  సుబ్బరామయ్యగారి మరో

కామెంట్స్