మహా శివరాత్రి పూట..మా మాట

Telugu

శివం అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మార్పులేని, కష్టాలను తొలగించి, అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని ప్రసాదించే తత్వం. శివతత్వం అనంతం. ఈ తత్వాన్ని నమ్మి…అనుసరిస్తూ… అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని అందిస్తూ,ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా మనకు చేతనైన ఓ పని చేయాలనుకుని రెండు సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజు… తెలుగువారి జీవితంలోని అన్ని అంశాలను స్పృశిస్తూ Telugu100.com పేరుతో వంద వెబ్ సైట్స్ ని ప్రారంభించటం జరిగింది.

ఈ వంద వెబ్ సైట్స్ ద్వారా అచ్చమైన తెలుగు తనాన్ని, స్వచ్చమైన కంటెంట్ ని ఇద్దాం అనేదే మా ప్రాధమిక ఉద్దేశ్యం. ఊహించినట్లుగానే మీ అందరి నుంచీ అనూహ్య స్పందన వచ్చింది. అయితే కొన్ని బాలారిష్టాలు తప్పలేదు. అలాగని భాధ్యతని మరవలేదు.ఎక్కడికక్కడ,ఎప్పటికప్పుడు ఇబ్బందులను పరిష్కరించుకుంటూ,నిలదొక్కుకుంటూ,నిచ్చనలా మమ్మల్ని మేము మార్చుకుంటూ,పైకి ఎగబాగుతూ… ముచ్చటగా మూడో సంవత్సరంలోకి ప్రవేశించాం. ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు కొన్ని పెండింగ్ ఉండవచ్చు. అనుకున్న స్దాయిలో పరుగు పెట్టలేకపోవచ్చు.  కానీ మేము మాత్రం మా కలను మర్చిపోలేదు. ఓ అద్బుతం జరుగుతుందనే నమ్మకం కోల్పోలేదు. అదే మా పెట్టుబడి..ఆస్ది.

మీరు ఎప్పటిలాగే మమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి,  మీ ఆలోచనలు పంచుకుంటూ మా అక్షరాలను దీవిస్తూ ఉంటే… మంచి వార్తలు, కథనాలు, ప్రతీ తెలుగు వాడికి ఉపయోగపడే కంటెంట్ ని కమనీయంగా అందిస్తాం. తెలుగు కబుర్లుతో ముస్తాబు చేస్తాం..తెలుగుదనంతో మిమ్మల్ని మెప్పిస్తాం.

lord shiva maha sivaratri shivaratri Srisailam vemulawada

ఇట్లు
Telugu100.com  టీమ్  

 • మహాద్బుతంగా…మహా శివరాత్రి వేడుకలు
  “హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర..”  ఇదే నిన్నంతా సందడి.. శుక్రవారం మహా శివరాత్రి కావడంతో దేశం అంతటా  శివనామ స్మరణతో మారుమోగింది. శివపార్వతుల కల్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని  భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. వేకువ జాము 3 గంటల…
 • మహా శివరాత్రి పూట..మా మాట
  శివం అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మార్పులేని, కష్టాలను తొలగించి, అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని ప్రసాదించే తత్వం. శివతత్వం అనంతం. ఈ తత్వాన్ని నమ్మి…అనుసరిస్తూ… అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని అందిస్తూ,ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా మనకు చేతనైన ఓ పని చేయాలనుకుని రెండు సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజు… తెలుగువారి జీవితంలోని అన్ని అంశాలను స్పృశిస్తూ Telugu100.com పేరుతో వంద వెబ్ సైట్స్ ని ప్రారంభించటం జరిగింది. ఈ వంద వెబ్ సైట్స్ ద్వారా…
 • తెలుగు కథకు పెద్ద దిక్కు వెళ్లిపోయింది
  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూయటం సాహిత్యాభిమానులకు తీరనిలోటే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. చక్రనేమి’ కథతో సాహితీ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బరామయ్య 200కు పైగా కథలు రాశారు… అనేక అవార్డులు అందుకున్నారు. 1938లో గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య చిన్నతనంలోనే తండ్రిని..తదనంతంరం అన్నయ్యని పోగొట్టుకున్నారు. అటు పాఠ్యపుస్తకాలు, ఇటు సాహిత్యమూ…
 • మహాత్ముడే మన భూత, భవిష్యత్తు, వర్తమానం
  ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్‌ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ కలిసి ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్‌ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు…
 • వ్యూహకర్త ఇక లేరు
  దేశవ్యాప్తంగా 108, 104 అంబులెన్స్‌ సహాయ సేవల వ్యూహకర్త, ప్రెస్‌క్లబ్‌ సీనియర్‌ సభ్యుడు డాక్టర్‌ అయితరాజు పాండు రంగారావు (75)ఇక లేరు. కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ సోమాజీగూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. . పంజగుట్ట హిందూశ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈయనకు డాక్టర్‌ భరత్‌ అనే కుమారుడు ఉన్నారు. రంగారావు గారి స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం. డాక్టర్‌ ఏపీ రంగారావుకు భార్య కరుణ,…