banner
Banner

కొందరిని గుర్తు పెట్టుకోవటం కష్టం…కొందరిని మర్చిపోవటం కష్టం. ఎక్కడో ఓ చోట ..ఎప్పుడో ఒకప్పుడు తగులుతారు అది వ్యక్తిగతంగానే కానక్కర్లేదు..తమ భావజాలంతోనూ పరిచయం కావచ్చు. కానీ అప్పటి నుంచి ఆ భావజాలంలో కొట్టుకోపోతాం. ఎప్పటినుంచో సదరు వ్యక్తులతో  పరిచయమున్నట్లు మమేకమైపోతాం. అలాంటి అద్బుతమైన కవితామహేంద్రజాలంతో మన తరాన్ని మహోన్నతంగా ఏలిన ప్రభంజనం  గుంటూరు శేషేంద్రశర్మ.

 గడిచిన  చరిత్రలో నాకు తావు లేదు
నడుస్తున్న చరిత్రకు నీతి లేదు..
డాములెందుకు  కడుతున్నారో..
భూములెందుకు దున్నుతున్నారో..
నాకే తెలీదు ….నా బ్రతుకొక సున్నా
కానీ నడుస్తున్నా..

అంటూ ధైర్యంగా మనస్సులో మాటలని సూదుల్లాంటి పదాలతో నిద్రపోతిన్న  సమాజంపై విసిరి మేల్కొపాలి, ధైర్యంగా నిలబెట్టాలి అంటే ఆయనకే సాధ్యం.  

కాలాన్ని నా కాగితం చేసుకుంటా..
దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా!! అని అంత ధైర్యంగా చెప్పగలవారెవ్వరు. ఆయన తప్ప.

అప్పడప్పుడూ ఆయన మాటలు భయపెడతాయి. నిజాలను నిలదీసేలా చేస్తాయి.
“ఇక్కడ జీవితం ఎవడిని వదిలిపెట్టదు
మనిషి నించి మనిషికి నిప్పింటిస్తుంది..”

మీరెలా ఇలా కవితలు రాయగలరు అన్నప్పుడు…

“కవిత్వం ఎర్రరంగు గుర్రంలా వస్తుంది
రక్తంలో ముంచిన బాణంలా..
…వీరుడు విడిచిన ప్రాణంలా..! అంటారు ఆయన

కాల బాహుళ్యము కలిగిన కవిత్వం రాసిన కవి శేషేంద్ర శర్మ ఆయన గురించి చెప్తారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి దగ్గరున్న నాగరాజుపాడులో అక్టోబరు 20, 1927లో జన్మించారు.ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  తండ్రి సుబ్రహ్మణ్యశర్మ, తల్లి అమ్మాయమ్మ. చిన్నతనం లోనే  “సొరాబు” అనే కావ్యాన్ని రాశారు. తాపి ధర్మారావు పనిచేస్తున్న “జనవాణి” పత్రికలో జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశారు. పిఠాపురంలో డిప్యూటీ పంచాయితీ అధికారిగా , హైదరాబాదు కార్పొరేషన్ లో అసిస్టెంటు కమీషనరుగా, డిప్యూటి కమీషనరుగా, సెక్రటరీగా అనేక భాధ్యతలు నిర్వహించిన కవిత్వం ను మాత్రం వదిలిపెట్టలేదు.

 ఆధునిక కవిత్వంలో విలక్షణ మార్గం తనదే అంటూ ప్రయాణం అటే పెట్టుకున్నారు. అటు మార్క్సిజాన్ని, ఇటు వేద సారాన్ని నింపిన కవితలు కవ్విస్తాయి..కదనరంగంలో సైనికులా కవాతు చేస్తాయి. వచనకవిత్వంలోని నూతన సంప్రదాయాలకు శ్రీకారం చుట్టిన ఈ కవి …కవిత్వంలో గాఢతను గుప్పించగల మేధోరవి. అందుకే ఆయన వచనశబ్ద శిల్పి. జనం మేలుకొని ప్రభంజనం అవ్వాలని కోరుకున్నా, నేల విడిచి సాము చేయటం మాని, నేల సాగు చేయటం తెలుసు కోవాలన్నా ఆయనకే సాధ్యం. పట్నం లో ఇనుప గోడల మధ్య బందీగా ఉండటం కన్నా, పొలంలో దుక్కి దున్నటం గొప్పని ఆయన చెప్తూంటారు.

 ఇక ఆయన్ను ప్రపంచం గుర్తించి గౌరవించి తీరు …రవీంద్ర నాథ్ టాగూర్ తర్వాత నోబుల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన సాహితీవేత్త… గుంటూరు శేషేంద్ర శర్మ గారు!

అవార్డులు..

1993 – సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
1999 -సాహిత్య అకాడమీ అవార్డు
రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
1994 – తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ .

శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ  తెలుగు సినిమా ముత్యాలముగ్గు లో  “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన  సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట. శేషేంద్ర శర్మ జయంతి సందర్బంగా 
 ఆయన్ని స్మరించుకుంటూ తెలుగు 100 ఆయన కవితామృతాన్ని మరోసారి గ్రోలమని సాహిత్యాబిమానులకు గుర్తు చేస్తోంది. 

Banner
, , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner