Banner
banner
banner
Banner
banner

నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. – లూకా 2:11

ఆ రాత్రి తమ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు ఎప్పటిలాగే తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఊహీంచని విధంగా ఓ అద్బుతం జరిగింది. ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెలకాపరులు భయపడ్డారు.  అయితే దేవదూత చక్కటి చిరునవ్వుతో వారిని చూస్తూ…”మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు” అని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పాడు.

banner

అంతకు ముందే పశువుల పాకలో మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఇదంతా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జరిగింది. ఆ రోజే  జీసస్ జన్మించాడు. అప్పటినుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ రాక ముందు నుంచే ఈ చెట్టును తమ ఇంటిలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు క్రైస్తవులు.

నిజమైన క్రిస్మస్ అంటే రక్షణ పొంది , ఆ రక్షణను బట్టి దేవుని స్తుతిస్తూ ఆ రక్షణ సువార్తమానమును అనేకులకు తెలియచేస్తూ దేవుని మహిమపరచడం అట్టి రీతిగా దేవుడు మన అందరిని నడిపించునుగాక

నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచూ ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. – ఆదికాండము 28:15
 ఆమెన్

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner