• ఆగస్టు 2021లో జరుగనున్న వీసీసీ సౌత్‌ ఆసియా ఫైనల్స్‌లో ప్రవేశించిన వెలాసిటీ గేమింగ్‌
• అధికశాతం మంది వీక్షకులు 18 మరియు 34 సంవత్సరాల వయసు కలిగిన వారే కావడంతో, ఈ–స్పోర్ట్స్‌కు దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు అధికంగా భారత్‌లో ఆదరణ ఉంది
• ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ అసాధారణ కెరీర్‌ అవకాశాలను కేవలం గేమర్స్‌కు మాత్రమే కాదు, కాస్టర్స్‌, గేమ్‌ లోపల పరిశీలకులు, ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు, కెమెరా మెన్‌, విశ్లేషకులు మొదలైన ఔత్సాహికులకు సైతం ఉపాధిని అందిస్తుంది
• న్యూ జూ యొక్క గ్లోబల్‌ ఈస్పోర్ట్స్‌ మరియు లైవ్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌ నివేదిక ప్రకారం, ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ 2021లో 1.084 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. గత సంవత్సరం ఇది 947.1 మిలియన్‌ డాలర్లు.


హైదరాబాద్‌, జూలై 20,2021 ః క్యాజువల్‌ గేమర్‌ మొదలు, తన కుటుంబ వ్యాపారాలను నిర్వహించడం నుంచి ఈ–స్పోర్ట్స్‌ (ఎలకా్ట్రనిక్‌ క్రీడలకు సంక్షిప్త రూపం లేదా వ్యవస్థీకృత వీడియో గేమ్‌ పోటీ) ప్రొఫెషనల్‌గా మారడం మొదలు ఓ ఈ–స్పోర్ట్స్‌ ఔట్‌ఫిట్‌ను సొంతం చేసుకోవడం వరకూ టీఎం సెంటినల్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన గోవిందరాజు మనోజ్‌ కశ్యప్‌, భారతీయ ఈ–స్పోర్ట్స్‌ రంగంలో సుదూరమే ప్రయాణించారు.


వీడియో గేమ్స్‌ వినియోగించుకుని నిర్వహించే ఓ విధమైన పోటీ ఈ–స్పోర్ట్స్‌. ఇది తరచుగా వ్యవస్థీకృత, మల్టీప్లేయర్‌ వీడియో గేమ్‌ పోటీలుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్‌ ప్లేయర్లు, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా పోటీపడుతుంటారు. ఈ–స్పోర్ట్స్‌ ఇప్పుడు వీడియో గేమ్‌ పరిశ్రమలో అతి ముఖ్యమైన విభాగంగా మారాయి. 2010 వ సంవత్సరం నుంచి ఎంతో మంది గేమ్‌ డెవలపర్లు చురుగ్గా గేమ్స్‌ డిజైన్‌ చేయడంతో పాటుగా టోర్నమెంట్లు మరియు ఇతర కార్యక్రమాల కోసం ఫండింగ్‌ను సైతం అందిస్తున్నారు. ఈ–స్పోర్ట్స్‌ వీక్షకులలో అధికశాతం 18–34 సంవత్సరాల నడుమ వ్యక్తులు ఉండటం చేత ఈ–స్పోర్ట్స్‌కు దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరీ ముఖ్యంగా భారతదేశంలో అధిక ప్రజాదరణ లభిస్తుంది.


నేడు, భారతీయ ఈ–స్పోర్ట్స్‌ ఔట్‌ఫిట్‌, వెలాసిటీ గేమింగ్‌ను ఈ ఈ–స్పోర్ట్స్‌ స్ట్రీమర్‌గా మారిన 33 సంవత్సరాల వ్యాపారవేత్త నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ రికార్డు స్థాయిలో వరుసగా 24 విజయాలను సొంతం చేసుకుంది. ఈ రికార్డును వేరెవ్వరూ ఇప్పటి వరకూ బద్దలుకొట్టలేదు. వెలాసిటీ గేమింగ్‌ యొక్క బృందం 2020లో జరిగిన 15 టోర్నమెంట్లలో 13 ఆడటమే కాదు, అన్నిటిలోనూ విజయం సాధించింది. థాయ్‌ల్యాండ్‌,మయన్మార్‌ మరియు సింగపూర్‌ వంటి దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ బృందాలను సైతం అధిగమించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో వెలాసిటీ గేమింగ్‌ ఇప్పుడు మూడవర్యాంక్‌ సాధిస్తే, ఇండియాలో నెంబర్‌ 1 ర్యాంక్‌ను పొందింది.


‘‘ఆగస్టు 2021లో జరుగునున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన వలోరెంట్‌ కాంకరర్స్‌ చాంఫియన్‌షిప్‌ (వీసీసీ) కోసం అర్హత సాధించిన మొట్టమొదటి దక్షిణాసియా టీమ్‌ వెలాసిటీ గేమింగ్‌ అని వెల్లడించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అంతేకాదు, ఇటీవల జరిగిన వీసీసీ ఇండియా క్వాలిఫయర్స్‌ స్టేజ్‌ –1 ఫైనల్‌లో ఈ ప్రాంతం నుంచి లైవ్‌ కాంకరెంట్‌ వాచింగ్‌ రికార్డులను సైతం మేము అధిగమించాం. గ్రాండ్‌ ఫైనల్‌ను దాదాపు 30వేల మంది గేమింగ్‌ ప్రియులు ప్రత్యక్షంగా తిలకించారు’’ అని మనోజ్‌ కశ్యప్‌ వెల్లడించారు. మహీ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా ఆయన సేవలనందిస్తున్నారు.


ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ విస్తృత శ్రేణిలో కెరీర్‌ అవకాశాలను సైతం అందిస్తుంది. కేవలం గేమర్లకు మాత్రమే కాదు, కాస్టర్లు, గేమ్‌ లోపల పరిశీలకులు, ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు, కెమెరామెన్‌లు, ఎనలిస్ట్‌లు మొదలైన అంశాలలో తమ ప్రయత్నాలను తీవ్రంగా చేసే ఔత్సాహిక యువతకు సైతం ఇక్కడ అవకాశాలు లభిస్తాయి.
వలోరెంట్‌ కాంకరర్స్‌ చాంఫియన్‌షిప్‌ను యుఎస్‌ కేంద్రంగా కలిగిన ప్లేయర్‌ ఫోకస్డ్‌ గేమ్‌ డెవలపర్‌ మరియు పబ్లిషర్‌ రియోట్‌ గేమ్స్‌ నిర్వహిస్తుంది. ఈ చాంఫియన్‌ షిప్‌ విజేత వీసీసీ చాంఫియన్‌షిప్‌ టైటిల్‌తో పాటుగా 33వేల డాలర్ల బహుమతి మొత్తంలో అత్యధిక వాటానూ పొందగలరు. రియోట్స్‌ వాలోరెంట్‌ గేమ్‌ను జూన్‌ 2020లో విడుదల చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 44 మిలియన్ల మంది యూజర్లు అంతర్జాతీయంగా ఉన్నారు.


హార్వార్డ్‌ యూనివర్శిటీకి చెందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి కశ్యప్‌. అతని 10 సంవత్సరాల వయసు నుంచి కూడా గేమింగ్‌ పట్ల అమితాసక్తిని కనబరిచే వాడతను. నిటెండో మరియు ఎక్స్‌బాక్స్‌ వంటి కన్సోల్‌ గేమ్స్‌ను ప్రయత్నించిన అతను, అనంతర కాలంలో హైదరాబాద్‌ మరియు భారతదేశ వ్యాప్తంగా వరల్డ్‌ సైబర్‌ గేమ్స్‌ (డబ్ల్యుసీజీ) నిర్వహించిన కౌంటర్‌ సై్ట్రక్‌ టోర్నమెంట్స్‌లో పోటీపడ్డారు.


‘‘ఈ–స్పోర్ట్స్‌ కూడా ఓ విధమైన క్రీడ. దీనిలో గేమర్లు బృందాలుగా ఏర్పడటంతో పాటుగా ఆటలాడతారు. దానికిగానూ వారు డబ్బునూ పొందుతారు. ఈ–స్పోర్ట్స్‌ను కెరీర్‌గా తీసుకోవాలన్నది నా కోరిక. అయితే ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు. నా దగ్గర తగినన్ని డబ్బులు వస్తే సొంతంగా ఓ గేమింగ్‌ కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాను. నా కల వాస్తవ రూపు దాల్చిందిప్పుడు. 2019లో వెలాసిటీ గేమింగ్‌ను ఆరంభించాను. ఈ–స్పోర్ట్స్‌ విభాగంలో ఇండియా ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ, ఇప్పుడు మొత్తం మార్కెట్‌ వృద్ధికి చోధకంగా నిలుస్తుంది. దీనికి ఇక్కడ ఉన్న యువతే కారణం. దీనితో పాటుగా అందుబాటు ధరలలో గేమింగ్‌ పీసీలు కూడా దోహదం చేస్తున్నాయి. ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ భారతదేశంలో రాబోయే కొద్ది సంవత్సరాలలో మరింత మంది యువతను ఆకట్టుకోనుంది. ఒక్కసారి ఇంటర్నెట్‌ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రావడంతో పాటుగా స్థిరంగా మారడం, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రచార స్ఫూర్తితో చిప్స్‌ తయారీని భారతదేశంలో అధికంగా చేయడం వంటి అంశాలు ఈ–స్పోర్ట్స్‌ విస్తరణకు దోహదపడతాయి’’ అని కశ్యప్‌ వెల్లడించారు.
న్యూ జూ యొక్క గ్లోబల్‌ ఈ–స్పోర్ట్స్‌ అండ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌ నివేదిక ప్రకారం, ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ 2021లో 1.084 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. గత సంవత్సరం ఇది 947.1 మిలియన్‌ డాలర్ల ఆదాయం సృష్టించింది. దీనితో పాటుగా ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా 833.6 మిలియన్‌ డాలర్లను పొందగలదని ఇది అంచనా వేసింది. ఈ–స్పోర్ట్స్‌కు లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రేక్షకులు పెరుగుతుండటమే దీనికి కారణంగా అభివర్ణించింది. ఈ నివేదిక అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆడియన్స్‌ 2021 సంవత్సరాంతానికి 728.8 మిలియన్లకు చేరనున్నారు. 2020లో ఈ సంఖ్య 662.6 మిలియన్లుగా ఉంది.


ప్రస్తుతం, వెలాసిటీ గేమింగ్‌ యొక్క మొత్తం కార్యకలాపాలకు మనోజ్‌ కశ్యప్‌ ఒక్కరే నిధులను సమీకరిస్తున్నారు. అయితే, ఈ కంపెనీ ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియో(మరిన్ని జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లను గెలుచుకున్న తరువాత)ను శక్తివంతంగా మార్చుకున్న తరువాత బాహ్య పెట్టుబడిదారుల నుంచి కూడా నిధులను సమీకరించాలని చూస్తుంది

, , ,
Similar Posts
Latest Posts from Vartalu.com