Banner
banner
banner

రంగురంగుల పూలతో పేర్చిన ఆ బతుకమ్మను పట్టుకుని తెలంగాణ ఆడపడుచులు పట్టు చీరలతో వస్తుంటే తెలంగాణ సంస్కృతి ఇట్టే ఉట్టిపడుతుంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. ఆడపిల్లలు అత్తారింటి నుండి పుట్టింటికి చేరుకుని హాయిగా నవ్వతూ ఈ పండగను జరుపుకుంటారు. అక్కా చెల్లెలు తమ పుట్టింటి వారితో అనుబంధాన్ని, కష్టసుఖాలను ఈ పండుగ నాడు బాగా పంచుకుంటారు. ఈ పండగ రాష్ట్ర పండగ కావడంతో తెలంగాణ వచ్చినప్పటి నుండి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ప్రభుత్వం వారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పండుగకు ఏర్నాట్లు చేస్తున్నారు.

 తెలంగాణలో అన్ని ఊర్లు, పల్లెలు బతుకమ్మలు తీసుకెళ్ళుతున్నాయి.  బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అధికారికంగా నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలోనే  ఈ బతుకమ్మ ఉత్సవాలు రవీంద్రభారతిలో  13 అక్టోబర్ 2021 న సాయంత్రము 6 గంటలకు ఘనంగా జరగనున్నాయి. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ నీహారిక రెడ్డి ఈ బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటున్నారు. బతుకమ్మ ఆడుకుందాం ..
 మీరు అందరు ఈ బతుకమ్మ పండగకి వచ్చి ఈ సంబరానికి వైభోగాన్ని , ఘనవిజయాన్ని తెస్తారని ఆశిస్తున్నాము అంటూ ఆమె పిలుపు ఇస్తున్నారు. 

Banner
, , , , , , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner