banner
Banner

ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానం. ప్రతి దానికి వివరణ అవసరం లేదు.  ఒక్క ఫొటో చాలు.. ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు. కాలగర్భంలో కలిసిన ఎన్నో విషయాలను, మరెన్నో జ్ఞాపకాలకు ప్రత్యక్ష సాక్షాలుగా నిలపటానికి.  కరిగేకాలము లో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు . ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి , జీవతకాలం వాటిని పదిలంగా దాచుకుని , అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులుగానే చూస్తూంటాం. అయితే… అదే సమయంలో కెమెరా తీసే ఒక్క ఫొటో ..మన జీవితాల్లో జరిగే తప్పు,ఒప్పులను ఎత్తి చూపచ్చు.

 మనకు జ్ఞానం కలిగించవచ్చు. జ్ఞానోదయాలు కలిగించవచ్చు.   కెమేరా బంధించిన చిత్రం…ఆహ్లాదానిచ్చేదైనా, అమృతాన్ని కురిపించేదైనా, విషయాన్ని చెప్పేదైనా, విషాన్ని కక్కేదైనా….ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా…. ఉన్నది ఉన్నట్లుగా చూపించడం మాత్రమే ఫొటోకు తెలిసిన విద్య. ఇప్పుడు అలాంటి ఓ ఫొటోనే ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తోంది. మన జీవితాల్లో సంప్రదాయంగా మారిపోయి,మన కుటుంబాల్లో కలతలు రేపి, ఎంతో మంది కన్నీళ్లకు కారణమవుతున్న వరకట్నాన్ని వధించేందుకు విచ్చు కత్తిలా రెడీ అయ్యింది.

ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో ఓ అమ్మాయి ఓ బండి లాగుతోంది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు దుస్తుల్లో ఉంది. అలాగే ఆ బండి నిండా నగలు, బట్టలు, ఇంకా ఇంటికి సరపడ సామాను ఉంది. అంతేకాదండోయ్ ఆ బండిలో ఓ పెళ్లికొడుకు కూడా ఉన్నాడు. ఈ ఫొటో ద్వారా కట్నం స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేసాడు డిజైనర్ Ali Xeeshan. యుఎన్ కు చెందిన ఓ మహిళ మోడల్ గా ఉంది. ఈ ఫొటో మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది.  ఈ సీన్ ఫ్యాషన్ వీక్ లో షో స్టాఫర్ కాదు..మన ఆలోచనల స్టాఫర్. ఆ ఇమేజ్ చెబుతున్న కళ్లకు కట్టే వాస్తవాన్ని ప్రపంచానికి చాటాలనుకున్న వీరి ప్రయత్నం సఫలీకృతం అయ్యినట్లే.   అద్భుతంగా కనిపించే మన సంప్రదాయ ప్రపంచానికి రెండో వైపున ఉండే మురికిపై ఈ ఫొటో అద్భుతంగా చర్చ జరుపుతుందనటంలో సందేహం లేదు. ఆ చర్చలో మీరూ పాల్గొనవచ్చు. ఎందుకంటే ఈ సమస్య మీ ఇంట్లోనూ ఉండవచ్చు.

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner