banner
Banner

కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలుగా పరిగణింపబడతాయి. అలాంటిదే  ఒక అమ్మాయి తీసుకున్న ఓ నిర్ణయంతోనే వేలమంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాసం వచ్చింది. ఓ అమ్మాయి తన జీవితంలో పెళ్లి కట్నం కోసం దాచిన డబ్బుని అమ్మాయిల హాస్టల్ కు డోనేషన్ గా ఇచ్చింది. అందుకు ఆమె తండ్రి కూడా సహకరించారు.

వివరాల్లోకి వెళితే..  . రాజస్థాన్‌ లో బార్మర్ నగరంలోని కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్. అంజలి కి ఈ నెల 21న మదన్‌సింగ్‌ రాంధాతో పెళ్లి కుదిరింది. అయితే ఈ పెళ్లికి తండ్రి ఇచ్చే కట్నాన్ని బాలికా విద్యను ప్రోత్సహించడానికి అమ్మాయిల హాస్టల్‌ నిర్మాణానికి ఖర్చు చేయాలని ఆమె భావించింది. అందుకు ధైర్యం చేసి కూతురు తండ్రిని కోరింది. కూతురి కోరిక విన్న ఆ తండ్రి ముందుగా ఆశ్యర్యపోయాడు. ఆ తర్వాత ఆమె అడిగిన కోరికకు ముగ్దుడయ్యాడు. సొసైటీ పట్ల కూతురిలో ఉన్న అవగాహనకు, ఆమె తీసుకున్న చొరవకు మద్దతు ఇవ్వాలనుకున్నాడు. అందుకే కూతురు అడిగినదానికి ఒకే చెప్పాడు. కూతురికి కట్నంగా ఇవ్వాలని అనుకున్న రూ.75లక్షలకు మరో 25 లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలను కలిపి బాలికల హాస్టల్ నిర్మించేందుకు విరాళంగా ఇచ్చాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

ఇది మరింత మందికి స్పూర్తిని ఇస్తోంది.  పెళ్లికి వచ్చినవారంతా ఈ తండ్రీకూతుళ్లకు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.  ఈ విషయమై NDTV ఇలా రాసింది, ‘సమాజ అభివృద్ధి కోసం డబ్బును పక్కన పెట్టడం మరియు కన్యాదాన్ సమయంలో బాలికల విద్య గురించి మాట్లాడటం ఒక స్ఫూర్తిదాయకమైన చర్య.’ అని చెప్పుకొచ్చింది.‘కూతురుకు మంచి విద్యను అందించినప్పుడు ఆమె పుట్టింటిని, అత్తింటిని రెండు కుటుంబాల భవిష్యత్తును మెరుగుపరచగలదు. అలాంటి కుమార్తెలు మన అందరి కుటుంబాల్లో ఉంటే సమాజం భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. అంజలి తన తండ్రి నుండి వివాహ వేడుక సందర్భంగా తీసుకున్న మొత్తాన్ని సమాజంలోని ఆడపిల్లల మంచి భవిష్యత్తు కోసం కేటాయించింది’ అని అక్కడ మీడియా జనం ఈ తండ్రీ కూతుళ్లను ప్రశంసిస్తున్నారు.

Banner
,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner