హైదరాబాద్ కు చెందిన కులదీప్ సేతి, సునీతా రెడ్డిల ఆధ్వర్యంలో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ని సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో ప్రారంభించారు. ఫిట్నెస్ గురు, సెలబ్రిటీ ట్రైనర్ కులదీప్ సేతి, 360 డిగ్రీ మేనేజింగ్ డైరెక్టర్,సీఈఓ సునీతా రెడ్డిలతో కలిసి విజయ్ దేవరకొండ ఈ ఛాలెంజ్ కి సంబంధించిన kuladepsethi.com వెబ్ సైట్ తో పాటు ఛాలెంజ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… నేను గత మూడు సంవత్సరాలుగా ఈ జిమ్ కు వస్తున్నాను. కరోనా ముందు ఇక్కడ ఎంతో మంది వచ్చి జిమ్ చేయడం చూశాను. లాక్ డౌన్ లో జిమ్ కు వచ్చే వాళ్లు తగ్గినా ఇప్పుడు మళ్లీ రావడం పెరుగుతోంది. నేను ఫైటర్ సినిమా కోసం బెస్ట్ బాడీ షేప్ తీసుకొచ్చాము. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఫిట్నెస్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షకులను ఎంచుకుంటున్నారు. ఆహార నియమాలను పాటిస్తున్నారు. తమను తాము మార్చుకోవడానికి అన్ని కసరత్తులు చేస్తున్నారని అన్నారు.

కుల్దేప్ సేథి 15+ సంవత్సరాల అనుభవంతో నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రముకులైన విజయ్ దేవరకొండ, అనుష్క శెట్టి, చిరంజీవి, రామ్ చరణ్, కార్టేకియన్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, కల్యాణ్ రామ్, రామ్ ఫోతినేని, రాజ్ తారున్, లావణ్య త్రిపాఠి వంటి ప్రముఖులకు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు కూడా అతని వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అతని నైపుణ్యం మరియు అనుభవం ఈ కార్యక్రమానికి పునాది.
సునీతా రెడ్డి 14 సంవత్సరాలుగా ఫిట్‌నెస్ పరిశ్రమలో ఉన్నారు మరియు రాష్ట్రంలో 360 డిగ్రీల ఫిట్‌నెస్ జిమ్‌లను ప్రారంభించడంలో ముందున్నారు. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పట్ల ఆమెకున్న అభిరుచి ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి కారణమైంది.

30 days ultimate weight loss challenge ప్రతి రోజు 30 నిమిషాల పాటు బరువు తగ్గేందుకు చేసే కార్యక్రమం. ఇంట్లోనే ఉండి సూచించిన వర్కౌట్స్, ఆన్లైన్ శిక్షణ ద్వారా బరువు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆహార నియమాలు, వర్కౌట్స్ కు సంబంధించి వీడియోలను, డైట్ ప్లాన్స్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నాం.

Similar Posts
Latest Posts from Vartalu.com