ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే అందుకోసం ప్రత్యేకంగా ఓ గురువుని ఎంచుకుని, ఆయన్ను కలిసి, ఎప్పుడు పాఠాలు చెప్తారో కనుక్కుని, అందుకు తగ్గ ఎమౌంట్ పే చేసి జాయన్ కావాలి. కానీ ఇప్పుడు ఇంట్రస్ట్ ఉంటే చాలు ఏదైనా నేర్చుకోవచ్చు. క్షణాల్లో కావాల్సిన ఇన్ఫర్మైషన్ సంపాదించేయొచ్చు. వీడియోల రూపంలో చూసేయొచ్చు. అందుకు యూట్యూబ్‌ ఓ వేదిక గా మారింది. అవి కుకింగ్ క్లాస్ లు కావచ్చు, లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ కావచ్చు లేదా సినిమాలు గురించి కావచ్చు ఇలా ఏదైనా సరే …క్షణాల్లో చూసేయచ్చు… నేర్చుకోవచ్చు.

అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది. యూట్యూబ్‌లో ఒకే టాపిక్ మీద చాలా వీడియోలు ఉంటాయి. వాటిల్లో ఇంట్రస్టింగ్ గా ఉండేది ఏది …చెప్పే సబ్జెక్టు ఒకటే అయినా కాస్త ఆసక్తికరంగా నేర్చేయాలంటే..  విజ్ఞానంతో పాటు ఎంటర్టైన్మెంట్ గా ఉంటే…భలే ఉంటుంది కదా…ఇప్పుడు మీకు ఇంగ్లీష్ స్పోకింగ్ కోర్స్ కోసం అలాంటి యూట్యూబ్ ఛానెల్ ఒకటి పరిచయం చేస్తున్నాం.

Sridhar Tells It అనే పేరుతో ఉండే ఈ యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడిప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ ఛానెల్ లో ఉన్న వీడియోలు ఇంగ్లీష్ లో మాట్లాడటం ఇంత ఈజీనా అనిపించే ధైర్యాన్ని ఇస్తాయి. నిజానికి చిన్నప్పటి నుంచి మనమంతా ఇంగ్లీష్ చదువుకున్నవాళ్లమే. అయితే మనలో చాలా మంది చిన్నప్పట్నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టు చదువుకున్నాం. దాంతో మనం ఇంగ్లీష్ లో ఉన్నవి చదవగలుగుతున్నాం కానీ రాయటం, మాట్లాడటం చేయలేకపోతున్నాం.

 అందుకు కారణం .., మన ఇంగ్లిష్ పరిజ్ఞానం మాత్రం అంతంత మాత్రమే కావటం.  చాలా మంది తెలుగు మీడియంలో చదువుకున్న స్టూడెంట్స్ కు ..ఇంగ్లిష్ లో మాట్లాడాలంటే చచ్చేంత భయం. ఇన్ని సంవత్సరాల నుండి ఇంగ్లిష్ నేర్చుకుంటున్నా, ఇంగ్లీష్ భాష మీద మనకు పట్టు రాకపోవడానికి కారణం..ఇన్నిరోజులు మనం ఇంగ్లిష్ ను ఒక సబ్జెక్ట్ గా చూస్తూండమే.   ఇంగ్లీష్ లో మనకు కేవలం మార్కులొస్తున్నాయి గాని మాట్లాడడం రావట్లేదు. ఆ సమస్యను మనం మన ఇంట్లోనే కూర్చుని ఈ వీడియోల ద్వారా తొలిగించుకోవచ్చు. లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మీకు అవసరం ఉందనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయదగ్గ ఛానెల్ ఇది.

, ,
Similar Posts
Latest Posts from Vartalu.com