కొన్ని సంఘటనలు మనకు మన రాజకీయనాయకులపై ఉన్న అభిప్రాయాలను కొన్ని సార్లు మారుస్తాయి..మరికొన్నిసార్లు అభిమానాన్ని రెట్టింపు చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై ఇలాంటి ప్రశంసలవర్షం కురుస్తోంది. ఆయన చేసిన చిన్న పని ..పెద్ద విషయమై అందరి మన్ననలూ పొందుతోంది.

నరసరావుపేటలో జరిగిన గోపూజ మహోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్.. సంక్రాంతి సందర్భంగా అక్కడికి వచ్చిన గంగిరెద్దులను చూస్తున్నారు. కొద్దిసేపు ఓ గంగి రెద్దు దగ్గర ఆగారు. దీంతో అక్కడే ఆ గంగిరెద్దును ఆడించే వ్యక్తి సీఎం జగన్‌ను అశీర్వదించాలని కోరాడు. దీంతో ఆ ఎద్దు ఆయనను ఆశీర్వదిస్తున్నట్టు తలను ఆడించింది.

ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను అడిస్తుండగా ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్‌పై ఉన్న ఇనుప రాడ్‌కు తగిలేలా అనిపించడంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్‌.. ఆ ఇనుప రాడ్‌పై తన చేతిని అడ్డుగా ఉంచారు.దీంతో సీఎం జగన్ చేసిన పనికి చేతులెత్తి నమస్కరించారు ఆ గంగిరెద్దు యజమాని. దీంతో సిఎం జగన్ కు మూగజీవలపై ఉన్న ప్రేమను అందరూ కొనియాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Similar Posts
Latest Posts from Vartalu.com