హైదరాబాద్ బ్లాక్ హాక్స్ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విపుల్కుమార్ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్1కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 05,2022న ప్రారంభంకానుంది. ఈ ఎంపిక ప్రకటనను మంగళవారం జరిగిన వర్ట్యువల్ పత్రికా ప్రతినిధుల సమావేశంలో టీమ్ ప్రధాన యజమాని అభిషేక్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కోచ్ రూబెన్ వోలోచిన్, అసిస్టెంట్ కోచ్ టామ్ జోసెఫ్ మరియు కెప్టెన్ విపుల్ కుమార్ పాల్గొన్నారు.

టీమ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం గురించి విపుల్ కుమార్ మాట్లాడుతూ ‘‘ మా ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి తో పాటుగా హెడ్ కోచ్ రూబెన్ వోలోచిన్, అసిస్టెంట్ కోచ్ టామ్ జోసెఫ్‌తో పాటుగా నాపై పూర్తి నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. టీమ్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తాను మరియు మా టీమ్ అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను. ఈ పోటీలో తామంతా సమిష్టిగా ఆడాల్సిన అవసరంఉంది. కలిసికట్టుగా మేము పోరాడాల్సి ఉంది. ఓ సీనియర్ ఆటగానిగా వీలైనంత వరకూ యువతరం క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను’’ అని అన్నారు.

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రధాన భాగస్వామి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బహుశా ఈ లీగ్‌లో అతి పిన్న వయస్కులు కలిగిన టీమ్ మాది. మా టీమ్‌కు ఉన్న ప్రధానమైన బలం విపుల్, మాకు కెప్టెన్‌గా ఉండటం. మ్యాచ్‌లోని ప్రతి గేమ్‌లోనూ ఆయన భాగం కావడంతో పాటుగా సెట్టర్‌గా ఆయన ఆడనున్నారు. వ్యూహాలను చక్కగా అమలు చేయడంతో పాటుగా తగిన రీతిలో అమలు చేయగలడనే నమ్మకం ఉంచతగిన ఆటగాళ్లలో విపుల్ ఒకరు. శిక్షణా శిబిరాలలో ఆయనను చూసిన తరువాత, విపుల్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలువగలరని భావిస్తున్నాను. టీమ్‌ను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకు ఉంది’’ అని అన్నారు.
హెడ్ కోచ్ రూబోన్ వోలోచిన్ మాట్లాడుతూ ‘‘మా యువ ఆటగాళ్లలో అత్యంత అనుభవశాలి అయిన క్రీడాకారుడు విపుల్. టీమ్‌లోని యువ ఆటగాళ్లకు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటుగా విజయం కోసం తీవ్రంగా పోరాటం చేస్తూ నాయకత్వ నైపుణ్యాలనూ ప్రదర్శిస్తుంటాడు. ఇప్పటివరకూ టీమ్‌లో అతని ప్రతిభను చూసిన తరువాత మేము గుర్తించిన అంశాలివి. టీమ్ లోపల అపూర్వ వాతావరణం మేము సృష్టించాము. శిక్షణ పట్ల ఆటగాళ్లు అసాధారణ అంకిత భావం చూపారు. టీమ్ నుంచి చక్కటి ప్రదర్శన మేము ఆశిస్తున్నాము. ఈ పోటీలో ప్రతి పాయింట్ కోసమూటీమ్ పోరాడాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

అసిస్టెంట్ కోచ్ జోసెఫ్ మాట్లాడుతూ ‘‘ఈ సీజన్లో కెప్టెన్‌కు అపూర్వమైన బాధ్యత ఉంది. ఎందుకంటే మా టీమ్‌లో ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ చక్కగా సహకరించుకోవడంతో పాటుగా పోటీలో సమిష్టిగా పోరాడాల్సి ఉంది. మా టీమ్ అద్భుతమైనది. ఎందుకంటే వీరంతా యువత. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ కోసం వీరంతా చక్కగా సిద్ధమయ్యారు. మా టీమ్ చక్కగా కుదిరిందని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ తమ తొలి మ్యాచ్‌ను కొచి బ్లూ స్పైకర్స్‌తో 05 ఫిబ్రవరి 2022న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్ వద్ద ఆడుతుంది.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ను ప్రత్యక్షంగా మరియు ప్రత్యేకంగా సోనీ టెన్ 1, సోనీ టెన్ 2 (మలయాళం), సోనీ టెన్ 3(హిందీ) మరియు సోనీ టెన్ 4(తమిళం, తెలుగు) మరియు సోనీ లివ్ పై ఫిబ్రవరి 05,2022 నుంచి 27 ఫిబ్రవరి 2022 వరకూ వీక్షించవచ్చు.