Banner
banner
Ravi kondala Rao
banner
Banner
banner

ఓ నట శిఖరం కూలిపోయింది అంటే సాహిత్యానికి అన్యాయం చేసినట్లు. ఎందుకంటే రావి కొండలరావు గారికి నటన,రచన రెండు కళ్లు. అలాగని రెండు పడవలపై కాలు పెట్టి ఎప్పుడూ ఆపసోపాలు పడలేదు. తనదైన శైలిలో రచనలు చేస్తూనే నటించేసారు. ఒకటా రెండా…రాముడు భీముడు, తేనె మ‌న‌సులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొంగ‌లు, అందాల రాముడు, ద‌స‌రా బుల్లోడు చిత్రాలు స‌హా 600కు పైగా చిత్రాల్లో న‌టించి అంద‌రి అభిమానం చూర‌గొన్నారు. రంగస్థలంపైనా, అటు వెండితెరపైనా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, గుమ్మడి, భానుమతి వంటి ఉద్ధండులతో కలిసి నటించి శభాష్ అనిపించుకున్నారు. రావికొండలరావు గారు ఏ పాత్ర వేస్తే ..అసలు ఆయన నిజ జీవితం నైజం అదేనేమో అనేటంతలా లీనమయ్యేవారు.

ఇక కొండలవారు గారు రాసిన కథలూ, నవలలూ, సినిమా నవలలూ, వ్యాసాలూ, నాటికలూ నాటకాలూ.. అన్నీ ఓ జాబితాకు ఎక్కిస్తే వందలకు వందలు దాటుతాయి. ఆయన రచనలు విలక్షణంగా ఉంటాయి. సులభంగా, సరళంగా, ఆహ్లాదకరంగా… అచ్చం ఆయనలానే ఉంటాయి. వాటిని చదివిన వారు వాటికి ఎడిక్టైపోతారు. అందుకేనేమో ఆయన 1966 జూలైలో ‘విజయచిత్ర’ తొలి సంచిక వచ్చిన నాటి నుంచి… 1992 వరకు ‘విజయచిత్ర’కు సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించగలిగారు. ఏ విషయం మీదైనా అపారమైన జ్ఞానం,అనుభవం ఎంతోమంది స్నేహితులను ఆయనకు సమకూర్చాయి. వయస్సుతో సంభంధం లేకుండా ఆయన స్నేహాలు సాగాయి. ఆయన రీసెంట్ గా ఈ నెల 19న తన స్నేహితులకు పంపిన ఫొటో మీరు ఇక్కడ చూడవచ్చు. అదే వారందరికీ చివరగా ఇచ్చిన స్మృతి.రావికొండల రావు గారి మృతి కి Telugu100.com ఘన నివాళి అర్పిస్తోంది

Banner
Similar Posts
Latest Posts from Vartalu.com
banner
banner