banner
banner

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్‌ ఇటీవలనే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ! కరోనా కాలం తరువాత అశేష ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చిన  భీమ్లా

నాయక్‌ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ ద్వారా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో  మార్చి 24 నుంచి స్ట్రీమింగ్‌ మొదలైన భీమ్లానాయక్‌ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది.

ఈ  సందర్భాన్ని పురస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్‌ కార్యక్రమాన్ని  హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం  జరిగిన ఈ

కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు.  ‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అని ‘గబ్బర్‌ సింగ్‌’లో  చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్‌’ సినిమాలో  ఏ విధంగా అయితే పవన్‌

కళ్యాణ్‌ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో  జీపుపై  పవన్‌ కటౌట్‌ను ఆవిష్కరించారు.  ఓ సినిమా ప్రమోషన్‌ కోసం భారీ స్ధాయిలో ఎలివేషన్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

పవన్‌ కళ్యాణ్‌ మాస్కులు ధరించి సందడి చేసిన అభిమానులు నెక్లెస్‌ రోడ్‌లో సందడి చేయడమే కాదు, ఈ ఎలివేషన్‌ను ఆవిష్కరించారు. ఓ క్రేన్‌ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా

చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో  వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు.
డిస్నీ+హాట్‌స్టార్‌లో  భీమ్లా నాయక్‌ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది.

Banner
, , , ,
Similar Posts

అభయ్‌కి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు..హీరో కునాల్‌ కెమ్ముజీ`5 ఒరిజినల్‌ సిరీస్‌, ‘అభయ్‌ 3 ప్రమోషన్ల కోసం కునాల్‌ కెమ్ము, కెన్‌ ఘోస్‌ హైదరాబాద్‌ను సందర్శించారు

Latest Posts from Vartalu.com
Banner
Banner