పోరాట గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు.. స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు.. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలుతో ఎక్కడ చూసినా వినపడుతున్నాయి. కనపడుతున్నాయి.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 67వ పుట్టిన రోజును పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత వైభవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. లీడర్లు చెప్పే శుభాకాంక్షలతో మీడియా మొత్తం కేసీఆర్ వైపే అటెన్షన్ ఇస్తోంరు. టీఆర్ఎస్ లీడర్ల ప్రత్యేక కార్యక్రమాలతో.. పుట్టిన రోజు సెలబ్రేషన్స్ తో అంతా హడావిడిగా ఉంది. తెలుగు సినీ నటులు కూడా ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు.మరో ప్రక్క కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. మొక్కులు నాటే కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇవ్వాళ ఉదయం 10 గంటల నుంచి.. ఈ ప్రోగ్రామ్ మొదలైంది. లీడర్లు.. తారలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
1954 ఫిబ్రవరి 17న సిద్ధిపేటలో జన్మించిన కేసీఆర్… తన మాటలతో, చేతలతో,అంతకు మించిన ప్రజాభిమానంతో.. అభిమానుల సంఖ్యను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. మిగతా రాజకీయ నాయకుల్లాగ ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా చురుకుగా ఉండటం కంటే… స్వయంగానే ప్రజలతో టచ్లో ఉంటూ వారి అభిమానాన్ని, తన ఫాలోయర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఆయనపై ప్రజలు ఇంతలా అభిమానం చూపించడానికి లెక్కలేనన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్ను ప్రజలకు చేరువ చేశాయటంలో సందేహం లేదు. అందుకే … రెండోసారి ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
ఈ కృతజ్ఞతతో తెలంగాణలో లోటు బడ్జెట్ ఉన్నా, నిధులు లేకపోయినా… ప్రభుత్వ పథకాల్నీ, ప్రాజెక్టుల్నీ కొనసాగిస్తున్నారు కేసీఆర్. కాబట్టే కేవలం పార్టీవారే కాకుండా కేసీఆర్ పుట్టిన రోజును ..అభిమానులంతా తమ ఇంట్లోని ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. రైతు బంధువు, చేనేత లక్ష్మి, కళ్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్, ఆసరా పింఛన్ స్కీం, అమ్మఒడి కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి, హరితహారం, మిషన్ కాకతీయ, షీ టీమ్స్, కంటి వెలుగు, టీఎస్ ఐపాస్ ఇలా ఎన్నో పథకాలు కోరని వరల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి . అంతేకాదు. మేనిఫెస్టోలో ప్రకటించనవి కూడా ఆయన చేస్తున్నారు. నీటి కష్టాల్ని తొలగించేందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలను ప్రారంభించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందు వరుసలో నిలిపేందుకు కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. దాంతో కేసీఆర్ పాలనపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ తరహా పాలనే ప్రజలకు ఆయన్ని దగ్గర చేస్తోంది.
అందుకే ఆయనకు జాతీయ స్దాయిలో పేరు వచ్చింది. ఈ రోజు జాతీయ స్థాయి నేతల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తదితరులు కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపూ ట్వీట్లు చేశారు. ఆయన నిండ నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు తమ ట్వీట్లలో ఆకాంక్షించారు.
ఇవన్నీ ఒకెత్తు అయితే ..ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవటం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.
బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు గులాబీ బాస్ కు తెలుగు 100 పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.