banner
banner

ఎక్కడైనా ఉద్యోగం పోతే బాధ పడతారు..ఇక్కడ అయితే ట్విట్వర్ సీఈవో పరాగ్ అగర్వాల్ విషయంలో మాత్రం రివర్స్. ఆయన ఉద్యోగం నుంచి తప్పిస్తే హ్యాపీగా 300 కోట్లు పైన తీసుకుని బయటకు వెళ్లిపోతారు. అదెలా అంటే

ట్విట్టర్ ని ప్రపంచ కుబేరుడు ఎలోన్ మాస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే . దాంతో టెస్లా బాస్ ట్విట్టర్‌కు హెడ్ అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియా జనాలు, బిజినెస్ వర్గాల్లో ఓ అతి పెద్ద సందేహం మొదలైంది. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ యొక్క CEOగా కొనసాగుతారా? లేదా అనేది.

Photographer: Clark Baker

అయితే ఎక్కువ శాతం పరాగ్ అగర్వాల్ ని తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే తాను ట్విట్టర్ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకమని, కాబట్టి రాబోయే రోజుల్లో మేనేజ్‌మెంట్‌లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని మస్క్ గతంలో చెప్పటమే అందుకు కారణం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మస్క్… పరాగ్ అగర్వాల్‌ను తొలగించాలని నిర్ణయించుకుంటే, ఈ బిలియనీర్ అతనికి దాదాపు $42 మిలియన్లు చెల్లించవలసి ఉంటుంది. అంటే 300 కోట్లు పైనే అన్నమాట.

రీసెర్చ్ సంస్థ ఈక్విలర్ ప్రకారం, 12 నెలల్లోపు అగర్వాల్‌ను తొలగించినట్లయితే, మస్క్ సుమారు $42 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం అటు మాస్క్ కానీ , ఇటు పరాగ్ అగర్వాల్ ఇంకా కామెంట్ చేయలేదు. కాబట్టి, అగర్వాల్ భవిష్యత్తులో ట్విటర్ సీఈఓగా కొనసాగుతారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఆయనే సీఈవో.
పరాగ్ గతేడాది నవంబర్ నుంచి ట్విట్టర్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో కంపెనీలో CTO గా పనిచేశాడు.

Banner
, , , ,
Similar Posts
Latest Posts from Vartalu.com
Banner
Banner