రవిదాస్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీ లో గల శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాని కి వెళ్లి గురు రవిదాస్ జీ కి నమస్కరించారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో
‘‘పుణ్యప్రదమైనటువంటి రవిదాస్ జయంతి సందర్భం లో ఈ రోజు న నేను దిల్లీ లోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాని కి వెళ్ళి దర్శనం చేసుకొన్నాను.’’
‘‘రవిదాస్ జయంతి సందర్భం లో దేశ ప్రజలందరి కి ఇవే శుభాకాంక్షలు.’’
‘‘సంత్ రవిదాస్ గారి ఈ పవిత్ర ధామం ప్రజలందరి కీ ఒక ప్రేరణ స్థలం గా ఉన్నది. పార్లమెంట్ సభ్యుని గా నాకు ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాల ను పూర్తి చేసే అవకాశం లభించినందుకు నేను అదృష్టవంతుడి ని.’’
‘‘దిల్లీ లో శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరం లో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమైనటువంటిది.’’ అని పేర్కొన్నారు.