top News

స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ ఆడిషన్స్  ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో

• రిజిస్ట్రేషన్ అదే రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సెయింట్ జార్జ్ గ్రామర్ గర్ల్స్ స్కూల్, హోటల్ తాజ్ మహల్, కింగ్ కోటి రోడ్, హైదరాబాద్‌లో చేయవచ్చు. సంగీతం లో అద్భుతాలను సృష్టించాలనే సంకల్పం;   మాట పట్ల మమకారం ; సాధించాలనే తపన ; అన్నిటినీ మించి మీలో ప్రతిభ ఉందనే నమ్మకం... చాలు , సూపర్‌ సింగర్‌ మీరే కావొచ్చు.  ఎంతోమంది ఔత్సాహికుల ప్రతిభను వెలికి తీయడంతో పాటుగా సినీ, శాస్త్రీయ సంగీతంలో  గాయనీగాయకులుగా అవకాశాలు అందించిన స్టార్‌ మా  సూపర్‌ సింగర్‌ పోటీలు తిరిగి వచ్చాయి. కాకపోతే ఈసారి జూనియర్ల కోసం ఈ పోటీలు జరుగబోతున్నాయి. ఆరేళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు బాలబాలికలు  స్టార్‌ మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌  పోటీలలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఆడిషన్స్‌  మార్చి 27వ తేదీ విశాఖపట్నంలో జరుగబోతున్నాయి. ఏప్రిల్ 10, 2020న హైదరాబాద్‌లో ఆడిషన్స్ జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అదే రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సెయింట్ జార్జ్ గ్రామర్ గర్ల్స్ స్కూల్, హోటల్ తాజ్ మహల్, కింగ్ కోటి రోడ్, హైదరాబాద్‌లో చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం...! గొంతు సవరించుకోండి.. మీలోని  గాన గంధర్వుడిని మేలుకొల్పండి. రేపటి సూపర్‌ సింగర్‌ మీరేకండి !!

సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన నాగార్జున,నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టి లు

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ…

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ – నాగు గవర ‘నాతిచరామి’ ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'. శ్రీ లక్ష్మీ…

‘జీ 5’లో ‘రిపబ్లిక్’ సినిమా చూడండి… మీ స్పందన తెలియజేయండి! – సాయి తేజ్

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్య వ్యవస్థలో…

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైమ్‌… డైరెక్ట‌ర్ కామెంటరీతో ‘జీ 5’లో ఈ 26న విడుద‌లవుతున్న ‘రిప‌బ్లిక్‌’

వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక 'జీ 5'. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది.…

venditera

దృశ్యం

వార్తలు

పి.ఐ.బి విజయవాడ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ వి.రవి రామకృష్ణ కన్నుమూత

పి.ఐ.బి విజయవాడ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ వి.రవి రామకృష్ణ కన్నుమూత

పత్రికా సమాచార కార్యలయం (పిఐబి), విజయవాడ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ వి. రవి రామకృష్ణ ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో…

పుస్తకాలు

విశ్వనాధ్ వెంకట్ దాసరి నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి

విశ్వనాధ్ వెంకట్ దాసరి నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి

రచయిత: విశ్వనాధ్ వెంకట్ దాసరిపుస్తకం: నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి (Nuggets Of Knowledge) తన దృష్టి లోపాన్నిఅధిగమించి ఇంగ్లీష్ రచనలు చేస్తున్న విశ్వనాధ్ వెంకట్ దాసరి తన మూడో పుస్తకాన్ని ఈరోజు గోకవరం లో విడుదల చేసారు. తన మొదటి రెండు పుస్తకాలు నవలలు కాగా ఈ పుస్తకం మన ప్రాచీన భారత దేశంలో ఉన్న మహాత్ముల గురించి, దేవాలయాల గురించి , లలితకళలు , ఆధ్యాత్మికత, రామాయణ మహాభారత సారం , ఆయుర్వేదం , వీరనారులు మహారాజుల గురించి తన దృష్టికోణంలో రచయిత కధానికల రూపంలో వ్రాయడం జరిగింది. దైవభక్తి డాట్ కామ్ అనే వెబ్ సైట్ కు కంటెంట్ రైటర్ గా ఇటీవల తాను అందించిన స్నిప్పెట్స్ ప్రేరణతో ఈపుస్తకాన్నీ రాయడం జరిగింది అన్నారు విశ్వనాధ్. దేహమే దేవాలయంగా, జీవమే దైవం గా కొలిచే ప్రాచీన భారతీయ సంస్కృతి, సాంకేతికంగా నిరూపితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్నిమరచి ఇప్పటి తరాలు అటు మేధస్సుకు ఇటు జ్ఞానానికి కాకుండా దారితప్పుతున్నారు. ఈ నేపధ్యంలో, మన యువతకు భారత దేశ అసలైన చెరిత్ర, మన దేవాలయాలు, ఋషులు, ఆళ్వారులు, నాయనార్లు, కాకతీయులు, రెడ్డిరాజులు విజయనగరరాజులు మొదలైన వారు మనదేశానికి చేసిన సేవ అందరికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాసరి విశ్వనాధ్ వ్రాసిన మొదటినవల ‘ఫారో అండ్ ది కింగ్’ ని 2012 లో మెగాస్టార్ చిరంజీవి విడుదల చెయ్యగా, రెండో నవల 'ది విక్టోరియన్' బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చేతులమీదుగా 2017లో ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం విశ్వనాధ్ తన నాల్గో పుస్తకం (మూడో నవల) ను వ్రాసే పనిలో ఉన్నాడు. రచనలే కాకుండా, విశ్వనాధ్ ఫిల్మ్మేకింగ్ మరియు చిత్రకళానైపుణ్యంగలవాడు. కలర్ బ్లయిండ్నెస్స్ని అధిగమించి తాను నలభైకి పైగా పెయింటింగులు వేశారు. అంతర్జాతీయ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యాలనుకుంటున్నానని విశ్వనాధ్ అన్నారు. తన మూడో పుస్తకం నగ్గెట్స్ అఫ్ నాలెడ్జి అమెజాన్ , నోషన్ ప్రెస్ మరియు ఫ్లిప్కార్క్ లో అందుబాట్లో ఉందన్నారు. పుస్తకావిష్కరణ రచయిత తల్లితండ్రులు దాసరి రాధాకృష్ణ , సత్య , ఇటీవలే తన రెండో పుస్తకాన్ని (Shivi and Her Will) రచించిన విశ్వనాధ్ సోదరి దాసరి సాయిజ, మీడియా ప్రతినిధుల మధ్య జరగగా, ఇన్ఫోసిస్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెత్సా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని కొనడానికి ఇక్కడ…