శివుడు ఫేస్ తీసేసి కేసీఆర్ ది పెట్టేసి...

updated: February 19, 2018 18:39 IST
శివుడు ఫేస్ తీసేసి కేసీఆర్ ది పెట్టేసి...

అభిమానులు, మీడియా ...తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని శివుడుతో పోలుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం..ఆయన పుట్టిన రోజు సందర్బంగా ముఖ్యమంత్రి ప్రజా సంభంధాల అదికారి... రమేష్ హజారి..కేసీఆర్ గురించి రాస్తూ ..ఆ విషయం ప్రస్దావించారు. తెలంగాణా ఉద్యమం అనే క్షీర సాగర మధనం జరిగినప్పుడు...తెలంగాణా అనే అమృతం వచ్చింది. తెలంగాణా వచ్చినంక ఆంధ్రా పాలనలోని అవలక్షణాలు బయిటపడ్డట్లు మధనం ద్వారా తనలో ఇన్నాళ్లూ దాచుకున్న విషాన్ని ముందలా బయిటపెడతది క్షీరసాగరం.  

అమృతం దక్కాలంటే ముందు ఆ విషాన్ని భరించాల్సిందే కదా...అలా కేసీఆర్ ..విషం లాంటి అనేక అపనిందనలు, అవమానాలను భరించి తెలంగాణా తెచ్చారు అన్నారు. అది దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ శివుడులా గ్రాఫిక్స్ లో కేసీఆర్ ఫొటోని మార్పింగ్ చేసి... ఇదిగో ఇక్కడ ఈ ఫొటోలో చూపినట్లుగా అభిమానులు హోర్డింగ్ పెట్టారు. అయితే హిందువులు కొంతమంది మాత్రం కేసీఆర్ గొప్పవాడు అనటంలో సందేహం ఏమీ లేదు కానీ...శివుడుతో మార్పింగ్ చేయటం ఏమిటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇదే హాట్ టాపిక్ గా మారింది ఫేస్ బుక్ ,ట్విట్టర్ లలో ...

comments