శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
ఈ రోజు అమ్మను దుర్గాదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ అష్టమి రోజున దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఈ రోజున వృత్తి వ్యాపారాల్లో స్దిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు.
పురాణోక్తం..
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.మహిషాసురుడుని అంతమొందించే సమయంలో కాళికామాత ధరించిన అవతారాలలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మాత దుర్గ అవతారంలో మహిషారుడితో భీకరమైన యుద్దం చేసిన వైనానికి గుర్తుగా అమ్మ దుర్గాదేవిగా కనిపిస్తుంది.
ఫలశ్రుతి
పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
కోటి సూర్య ప్రభలతో వెలుగొందే
కామెంట్స్